ఏపీలో దారుణం.. కలెక్టర్ ముందుకి తుపాకీతో వెళ్లిన ఆర్జీదారుడు!

ap collectoroffice krishnadistrict

జిల్లా కలెక్టర్‌ అంటే.. ఆయన స్థాయి వేరు. రోజుకే కొన్ని వందల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. చుట్టూ అంతే స్థాయిలో ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఇక రక్షణగా ఉండే పోలీస్ వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక జిల్లాని మొత్తం అడ్మినిస్ట్రేట్ చేయడం అంటే మాటలు కావుగా మరి? అయితే.., అలాంటి కలెక్టర్ ముందుకి తుపాకీతో వెళ్ళాడు ఓ ఆర్జీదారుడు. ఇప్పుడు ఈ ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ap collectoroffice krishnadistrictఅది కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో కార్యక్రమంలో భాగంగా ప్రజల అర్జీలను పరిశీలిస్తూ.., వారికి న్యాయం చేయడానికి పని చేస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడికి కొల్లు అశోక్‌ అనే వ్యక్తి ఓ జెంటిల్ మేన్ లా ఎంటర్ అయ్యాడు. తనకున్న స్థల వివాదం పరిష్కరించాలని కలెక్టర్ కి అర్జీ పెట్టుకున్నాడు. ఆ అర్జీ పరిశిలీస్తున్న సమయంలోనే తనకి ప్రాణరక్షణ కూడా కావాలని వేడుకున్నాడు.

కలెక్టర్ వీటి పై స్పందించే లోపే ఆ వ్యక్తి తన జేబులో నుండి తుపాకీ, కత్తి, కారప్పొడి బయటకు తీశాడు. ఈ హఠాత్ పరిణామంతో అంతా బిత్తరపోయారు. అయితే.. వెంటనే స్పందించిన పోలీసులు కొల్లు అశోక్‌ ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అశోక్ తీసుకొచ్చిన తుపాకీ నకిలీదని తేలడం. కేవలం కలెక్టర్ ని బెదిరించడానికే కొల్లు అశోక్‌ ఇలా చేశాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.