భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసిన భార్య.. కారణం తెలిస్తే షాక్!

ఈ మద్య కొంత మంది కామంధులు మాత్రం ఆడవారంటే ఆటవస్తువులుగా భావిస్తు వారిపై లైంగిక దాడులు.. అత్యాచారాలు.. హత్యలకు పాల్పపడుతున్నారు. ఆడవారిని చిత్ర హింసలకు గురి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వేధింపులు భరించలేని మహిళలు మగవారిపై తిరగబడుతున్నారు.

muga minతెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఒక దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో భ‌ర్త‌ను అతడి భార్య దారుణంగా చంపి అత‌ని మ‌ర్మాంగం కోసేసింది. వివరాల్లోకి వెళితే… మహబూబా బాద్ మరిపెడ మండలం తానం చెర్ల రెవెన్యూ పరిధిలోని వాంకుడోతు తండాలో బిచ్యానాయక్, ప్రమీల కొంత కాలంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్నారు. అయితే బిచ్యానాయక్ ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడం… కొట్టడం లాంటివి చేయడంతో.. భరించే ఓపిక లేక కోపంతో భార్య ప్రమీల ఏకంగా కోపం తో మర్మాంగం కోసి వేసింది. అతను గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చేసరికి సత్యం రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

mugag minఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిచ్యానాయక్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాత్రి నిద్రపోతున్న తన భర్త మర్మాంగం భాగంలో కొడవలితో కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.