వేల కోట్ల ఆస్థులు కూతుళ్ల పేరిట.. 90 ఏళ్ల వృద్ధురాల ఆరు బయట.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

ఈ మధ్య కాలంలో ఆస్థుల కోసం సొంత కొడుకులే ఎంతకైన తెగిస్తారనుకున్నాం.. కానీ అదే దారిలో కూతుళ్లు కూడా కదిలారు. ఇక రాను రాను కూతుళ్లు కూడా ఆస్థుల కోసం సొంత తల్లిని కాదనుకునే రోజులు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు బాలనాగమ్మ. ఈమెకు నలుగురు కుమార్తెలు ఉన్నారు.

motherఇక ఉన్న 50 ఎకరాల ఆస్థిలో కొంత కూతుళ్ల పేరిట రాసి ఇచ్చింది. ఇక అంతటితో ఆగని బాలనాగమ్మ కూతుళ్లు మిగిలిన ఆస్థి కోసం తల్లిని రోజు వేధించేవారు. అలా తల్లిని హింసిస్తూ ఇప్పటి వరకు 40 ఎకరాల భూమిని నలుగురు కూతుళ్లు తమ పేరిట రాయించుకున్నారు. ఆ తర్వాత తన తల్లిని కన్నేత్తి కూడా చూడకుండా రోడ్డున వదిలేశారు. దీంతో తాజాగా బాలనగమ్మ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు భాగంలో తమ కూతుళ్లు ఆస్థి కోసం నన్ను వేధిస్తున్నారని, ఆ తర్వాత నా పోషణను పట్టించుకోవటం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కోంది.

ఇక ఈ కేసుని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుని త్వరగా విచారించి నివేదిక ఇవ్వాలంటూ మానవహక్కుల కమిషన్ కు కర్నూలు ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. ఇక సొంత తల్లిని ఆస్థి కోసం వేధిస్తున్న కూతుళ్ల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.