సమాజంలో మంచిగా బతకాలంటే కాస్త కష్టపడాలి. అలా బతికితే ఓ విలువ ఉంటుంది. కానీ.., తప్పులు చేసి డబ్బు సంపాదించి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని చూస్తే మాత్రం కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ కూడా జీవితంలో ఇలాంటి తప్పులే చేశాడు. అందుకు ఫలితంగా ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రసన్నకుమార్ బీటెక్ మొదటి సంవత్సరం వరకు అందరి యువకుల్లా బాగానే ఉంటూ వచ్చాడు. కానీ.., ఆ వయసులో ఒక్కసారిగా దొరికిన ఫ్రీడమ్ కారణంగా వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అందుకు కావాల్సిన డబ్బు సంపాదించడానికి దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, బెట్టింగ్ వంటి మార్గాలను ఎంచుకున్నాడు.
ఇలా దొంగతనాలు చేయడం, బెయిల్ పై బయటకి రావడం ఇదే అతను లైఫ్ స్టయిల్ అయిపోయింది. ఈ క్రమంలోనే చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. పైగా.. తన మీద పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో డబ్బు సంపాదించే మార్గాన్ని మార్చుకున్నాడు. ఈసారి తన మోసాలకు సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నాడు ఈ కేటుగాడు.
ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పెళ్లైన ఆంటీలను టార్గెట్ గా చేసుకుని వారితో మాటలు కలపడం మొదలు పెట్టేవాడు. తరువాత వారిని ముగ్గులోకి దింపి.. న్యూడ్ కాల్స్, న్యూడ్ పిక్స్ షేర్ చేసుకోవడం వంటివి చేసేవాడు. అలా వచ్చిన ఫోటోలను సేవ్ చేసుకుని.. తనకి డబ్బు అవసరం అయినప్పుడల్లా అందరిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ప్రసన్నకుమార్ కొన్ని లక్షలు సంపాదించాడు.
చాలా మహిళలు ఈ దుర్మార్గుడు కారణంగా నరకం అనుభవించినా కాపురాలు కూలిపోతాయన్న భయంతో కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకి రాలేదు. కానీ.., తాజాగా ఓ మహిళ కంప్లైట్ ఇవ్వడంతో ప్రసన్నకుమార్ ని కడప అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ప్రసన్నకుమార్ ఫోన్ చెక్ చేసిన పోలీసులకి వందల సంఖ్యలో మహిళల ఫోటోలు కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఇతని చేతిలో మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ముందుకి వస్తే న్యాయం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రసన్నకుమార్ పై పోలీసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం విశేషం. మరి.. ఇలాంటి మృగాళ్ళకి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.