ట్రాక్ తప్పిన హెడ్​మాస్టర్.. విద్యార్థిని తల్లితో థాయ్ మసాజ్

Headmaster suspended for getting massage

సమాజంలో టీచర్ వృత్తికి ఎంతో విలువైన గౌరవం ఉంది. కానీ కామంతో ఊగిపోతున్న కొందరు ఉపాధ్యాయులు మాత్రం పవిత్రమైన వృత్తికి మచ్చతెస్తున్నారు. తాజాగా ఓ స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థిని తల్లితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మసాజ్ చేయించుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక బెంగళూరులోని కొదండరామాపుర ఉన్నత పాఠశాలలో లోకేషప్ప అనే వ్యక్తి హెడ్ మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఇటీవల బ్యూటీపార్లర్ నడుపుతున్న ఓ మహిళ తన కూతురి అడ్మిషన్ కోసం స్కూల్ కు వచ్చింది. ఇక ఆ ఆమే వృత్తిని తెలుసుకున్న ఈ మాస్టారు తనకు మసాల్ చేయాలని బెదిరించాడు. దీంతో తలొగ్గిన ఆ మహిళతో ఈ హెడ్ బలవంతంగా మసాజ్ చేయించుకున్నాడు. ఇక ఇదే దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వటంతో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది బాగా వైరల్ గా మారి ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. ఇక రంగంలోకి దిగిన అధికారులు నిందితుడు లోకేషప్పను బుధవారం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక ఈ హెడ్ మాస్టర్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.