కూతురి ప్రేమ పెళ్లి.. నచ్చని తల్లి మనవడిని దారుణంగా..!

died baby

ఈ మధ్యకాలంలో కులాంతరం వివాహాలు చేసుకున్న కూతుర్లపై తల్లిదండ్రులు దారుణంగా హింసిస్తున్నారు. తమ కూతురి కన్న పరువునే కాపాడుకునే కొందరు తల్లిదండ్రులు పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. ఇక తమిళనాడులో కూతురి ప్రేమ పెళ్లి చేసుకుందని అమ్మమ్మ మనవడిని దారుణంగా చంపింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తురుకు చెందని నాగలక్ష్మి అనే మహిళకు నందిని అనే కుమార్తె ఉంది. నందిని గతంలో తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో భర్తతో విభేదాల కారణంగా నందిని 9 నెలల కుమారుడితో పాటు ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఇక కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తల్లి నాగలక్ష్మికి కూతురిపై పగ పెంచుకుంది.

ఆ పగను కాస్త 9 నెలల మనవడిపై తీర్చుకుంది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్నిరి నోట్లో బిస్కెట్ ప్యాకెట్ కుక్కి దారుణంగా చంపేసింది. ఇక అనంతరం ఏమి తెలియనట్లు నటించి పడుకోబెట్టింది. చివరికి పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం ఖంగుతినే నిజాలు బయటకొచ్చాయి. చివరికి నోట్లో బిస్కెట్ ప్యాకెట్ కుక్కి అమ్మమ్మ చంపిందని తేలటంతో నిందితురాలైన నాగలక్ష్మిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.