చిన్నారి మరణానికి కారణమైన టీవీ.. మృత్యువు వెనుక అసలు నిజాలు..?

Girl Dies After Being Hit By TV in Krishna District - Suman TV

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ 11 ఏళ్ల బాలిక.. వారం రోజుల్లో ఘనంగా జరుపుకోవాల్సిన పుట్టిన రోజు. కానీ ఆ పాపను మృత్యువు వెంటాడింది. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. అది నందిగామ మండలం కంచల గ్రామం. నాగేశ్వరరావు, సౌందర్య ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పేరు చలమల కీర్తి. సరిగ్గా వారం రోజుల్లో పుట్టిన రోజు.

Girl Dies After Being Hit By TV in Krishna District - Suman TVదీంతో ఇంట్లో అప్పుడే హడావిడి మొదలైంది. ఓ రోజు చలమల కీర్తి ఆడుకుంటూ ఇంట్లో ఉన్న టీవీకి తగిలింది. దీంతో బాలిక కిందపడటంతో అదే టీవీ ఆ చిన్నారి తలపై బలంగా పడింది. దీంతో వెంటనే స్పందించిన తల్లి సౌందర్య ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆ చిన్నారి చనిపోయిందంటూ డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ వార్త తెలిసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక ఈ వార్తతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక అంతిమ సంస్కారాల్లో పుట్టిన రోజు కోసమని తెచ్చిన కొత్త గౌనును తల్లిదండ్రులు దరించి చివరి సారిగా చూసుకున్నారు.