ప్రియుడి మోజులో పడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను కడతేర్చింది ఆ ఇల్లాలు. భర్తను చంపి, పిల్లల్ని అనాథలుగా మార్చింది కిలాడీ లేడీ శివాని. విశాఖలోని కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో నివ్వెర పోయి నిజాలు వెలుగు చూస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను కడతేర్చింది ఆ ఇల్లాలు. భర్తను చంపి, పిల్లల్ని అనాథలుగా మార్చింది కిలాడీ లేడీ శివాని. విశాఖలోని కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో నివ్వెర పోయి నిజాలు వెలుగు చూస్తున్నాయి. భర్త, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు.. హాయిగా సాగిపోతున్న సంసారంలో టాక్సీ డ్రైవర్ రామారావు రూపంలో విలన్ వచ్చాడు. అతడితో శారీరక సంబంధం పెట్టుకుని..భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్త ఆస్తి, డబ్బులు, ఉద్యోగం కోసం.. ప్రియుడు రామారావుతో కలిసి పక్కా స్కెచ్ అమలు చేసిన శివాని.. గుండె పోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేసింది. పోలీసుల ముందు ఆమె పప్పులేమీ ఉడకలేదు. రమేష్ భార్య శివాని, ఆమె ప్రియుడ్ని పట్టుకుని విచారిస్తే అసలు విషయాలు బయటకు పొక్కారు. అయితే శివాని.. పరాయి పురుషుడితో తిరుగుతుందని తెలిసి కూడా ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. ఆమెతో జీవితాంతం కలిసి ఉండాలని భావించాడు. కానీ అంతలోనే కాలరాసింది ఆ దుర్మార్గురాలు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త రమేష్‌ను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ప్రియుడు రామారావుకు ఇచ్చింది. అతడు నీలా అనే వ్యక్తికి సుఫారీ ఇచ్చి హతమార్చిన సంగతి విదితమే. ఆ తర్వాత గుండె పోటు డ్రామా ఆడింది. అయితే చంపే ముందు ఆమె.. భర్త పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించింది. ఆగస్టు 1వ తేదీన ఇంటికి వచ్చిన భర్తకు ఇష్టమైన తలకాయ కూర వండింది. ఆ తర్వాత మందు తాగించి, వీడియోను రికార్డు చేసింది. ఈ వీడియోలో ఆమె పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు రమేష్. తన భార్య గొప్పతనం గురించి చెబుతూ ఉప్పొంగిపోయాడు. ‘మా ఆవిడ చాలా తెలివైంది. అది చదువుకున్నదీ తక్కువే గానీ, గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధించగలదు. ఈ మాట నేను అందరితో చెప్పేదే. నా వైఫ్.. నా లైఫ్.. తను చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నప్పుడే కాదూ.. లేనప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. అదే నా ధైర్యం. చాలా మంది చదువుకున్నా అమ్మాయిలకంటే నా భార్య చాలా బెస్ట్. దేవుడు కరుణిస్తే.. దానితో కలిసి బతుకుతా 100 ఏళ్లు. లేదా మధ్యలోనే పుటుక్కున పోతా’అంటూ చనిపోతానేమో ముందే తెలిసినట్లుగా మాట్లాడాడు రమేష్.
ఆగస్టు 1న ఈ వీడియో తీసి పెట్టుకున్న శివానీ.. అదే రోజు రాత్రి భర్త నిద్ర మత్తులోకి వెళ్లిపోయాక.. ప్రియుడు రామారావు, అతని స్నేహితుడు నీలాను పిలిచింది. ఆ తర్వాత నీలా.. భర్త ముఖంపై దిండు పెట్టి అదమగా.. భార్య శివాని.. కాళ్లు పట్టుకుంది. తనపై ప్రేమ కురిపించిన భర్త మాటలు గుర్తుకురాలేదో ఏమో ఈ కఠినాత్మురాలికి.. భర్తను చంపేస్తుంటే.. సహకరించడంతో పాటు.. ఆ ఘటనను కూడా వీడియో తీసింది ఈ హంతకీ. రామారావు ఎవ్వరైనా వస్తున్నారేమోనని బయట కాపులా కాశాడు. అనంతరం హార్ట్ స్ట్రోక్ నాటకం. అదంతా బూటకం అని తెలిసి.. పోలీసులకు ఫిర్యాదు వెళ్లడం.. ఊపిరాడక రమేష్ చనిపోయినట్లు నిర్ధారణ కావడం, భార్యను అరెస్టు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. అయితే రమేష్ చివరి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.
ఇది చదవండి : కానిస్టేబుల్ హత్య లో ట్విస్ట్! శివాని అక్క కూడా ప్రియుడితో