రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్లో ‘లక్స్ పాప’!… తనకే పాపం తెలియదట!..

Asha Saini Gives Clarity on Connection with Raj Kundra - Suman TV

రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సంచలనంగా మారింది. అశ్లీల వీడియోల ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. పోర్న్ చిత్రాల కేసులో పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. దాంతో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ భయపడుతున్నారు. కొందరు తాము మొదటి నుంచీ రాజ్ కుంద్రాకు దూరంగా ఉన్నామని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో టాలీవుడ్ నటి ఆశా షైనీ  అలియాస్ ఫ్లోరా షైనీ పేరు బయటకు రావడంతో వెంటనే ఆమె రియాక్ట్ అయింది.

imgpsh fullsize anim 3 1ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.రాజ్‌ కుంద్రా సన్నిహితుడు ఉమేశ్‌ కామత్‌తో ఫ్లోరా షైనీకి మంచి స్నేహ బంధం ఉందని, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటూ ఓ వాట్సాప్‌ చాట్ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో క్లారిటీ ఇచ్చిన ఫ్లోరా షైనీ ఉమేశ్‌ కామత్‌తో గానీ, పోర్న్ రాకెట్ కేసుతో గానీ తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పింది.

అవన్నీ వట్టి పుకార్లే అంటూ కొట్టిపారేసిన ఆమె, నన్ను సంప్రదించకుండా పైగా ఆ చాట్స్‌ నిజమైనవో కాదో తెలుసుకోకుండా ఇష్టారీతిన ప్రసారాలు చేయడం సరికాదని చెప్పింది. గతంలో ఎప్పుడూ రాజ్ కుంద్రాతో మాట్లాడింది కూడా లేదని ఫ్లోరా షైనీ చెప్పింది. వాళ్ళ క్యాస్టింగ్ టీమ్ పలు మార్లు నాకు కాల్ చేసి హాట్ షాట్స్ యాప్ కోసం రూపొందిస్తున్న వెబ్ సిరీస్ చేయమని అడిగినా తాను మాత్రం ఓకే చెప్పలేదని తెలిపింది.

పోర్న్ రాకెట్‌లో తన ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా ఇలా పేర్లు బయటపెట్టి ఈ కేసులోకి లాగడం బాధగా ఉందని చెప్పిన ఆమె, ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది ఓ మహిళ జీవితంతో చెలగాటం ఆడుకోవడమే అంటూ ఆవేదన చెందింది. మరో ప్రక్క మోడల్‌, నటి షెర్లి చోప్రాకు సమన్లు అందాయి.

అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు.