హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్న నిందితుడు చివరికి శవమై కనిపించాడు. దీంతో చిన్నారి పాపపై అత్యంత పాశవికంగా హత్యచేసిన నిందితుడికి సరైన గతి పట్టిందని కొందరు తెలియజేస్తున్నారు. అయితే నిందితుడు రాజు ఆత్మహత్యపై అతని అత్త యాదమ్మ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
చిన్నారిని చిదిమేసి ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన అతడికి బతికే హక్కులేదని, ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఆ పాప జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేశాడంటూ రాజు అత్త తనలోని ఆవేదనను వెల్లగక్కింది. ఇక నా కూతురికి వచ్చిన పరిస్థితి మరే కూతురుకి రావొద్దంటూ తెలిపింది.
ఇక దీంతో పాటు గతంలో నాపై కూడా అతడు గొంతు నొక్కబోయాడని, నా కుమారుడు వచ్చి అడ్డుకున్నాడని అన్నారు. ఇదే కాకుండా ప్రతీ రోజు మధ్యం సేవించి నా కూతురిని వేధించేవాడని, ఏనాడు నా కూతురిని సుఖంగా చూసుకున్న రోజులు లేవని యాదమ్మ తెలిపింది. ఇక రాజు అత్త యాదమ్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.