చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక స్టార్ నటి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం కన్నడ ప్రముఖ దర్శకుడు కిరణ్ గోవి మృతి చెందిన విషయం విదితమే. ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆఫీసులో హఠాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలిన గోపీని అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయినా లాభం లేకుండా పోయింది. కిరణ్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఈ విషాదం మరువకముందే మరో స్టార్ నటి సూసైడ్ చేసుకున్నారు. భోజ్‌పురి ప్రముఖ నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఆమె సూసైడ్ చేసుకున్నారు. వారణాసిలోని ఒక హోటల్‌లో ఆమె విగతజీవిగా కనిపించారు. ఆకాంక్ష సూసైడ్ ఘటనతో భోజ్‌పురి చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది.
25 ఏళ్ల ఆకాంక్ష.. ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్‌తో కలసి చేసిన మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమె సూసైడ్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఆకాంక్ష దూబే.. తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకునేవారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాలో తన రిలేషన్షిప్ గురించి అధికారికంగా ప్రకటించారామె. సహనటుడు సమర్ సింగ్‌తో ఉన్న ఫొటోలను ఆకాంక్ష షేర్ చేశారు. కాగా, గతంలో ఒకసారి ఆమె డిప్రెషన్లోకి వెళ్లారు. 2018లో డిప్రెషన్‌తో బాధపడి.. చాన్నాళ్లు మూవీస్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి పరిశ్రమలోకి వచ్చారు. ‘ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి)’, ‘వీరన్ కే వీర్’, ‘ఫైటర్ కింగ్’తో పాటు పలు ప్రాజెక్టుల్లో కనిపించి ఆడియెన్స్‌ను ఆమె ఆకట్టుకున్నారు.
Bhojpuri actress Akanksha Dubey dies allegedly by suicide at a hotel in Varanasi, Uttar Pradesh. Details awaited.
(Pic: Akanksha Dubey’s Instagram account) pic.twitter.com/Abw2oGkG7H
— ANI (@ANI) March 26, 2023