రచ్చకెక్కిన నటి సంజన వ్యవహారం

Sanjjanaa Galrani

ఎప్పుడు వివాదాల్లో నిలిచే నటి సంజన మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా బెంగుళూరులోని ఓ క్యాబ్ డ్రైవర్ పై చిర్రుబుర్రలాడి తన వ్యవహారాన్ని రచ్చకీడ్చుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా సంజన షూటింగ్ స్పాట్ కి తొందరగా వెళ్లేందుకు ఇందిరా నగర్ నుంచి కెంగేరి వెళ్లేందుకు మంగళవారం ఓ క్యాబ్ ని బుక్ చేసుకుంది. ఇక వెంటనే క్యాబ్ రావటంతో షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లానని డ్రైవర్ కి సూచించింది.

Sanjjanaa Galraniఇక దీనికి అంగీకరించిన డ్రైవర్ ఆమె సూచించి గమ్యస్థానానికి తీసుకెళ్లేపనిలో ఉండగా క్యాబ్ డ్రైవర్ తో కాస్త దుర్బుషలాడిందని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఏసీ వేయాలని చెప్పిందని వేసేలోగా నాపై తిట్ల పురాణాన్ని తెర తీసిందని తెలిపాడు. ఆమె కోరిన చోటకు తీసుకెళ్తున్నానని ఎంత చెప్పిన వినకుండా ఎంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె ఏకంగా నేను ఆమెను అపహరించానంటూ ఏకంగా ట్విట్టర్ పోస్ట్ పెట్టిందని తెలిపాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఇంతటితో ఆగకుండా ఆ క్యాబ్ డ్రైవర్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇక ఫిర్యాదు చేసిన సంజన వెంటనే ఫిర్యాదును వెనక్కి తీసుకుంటూ పోలీసులకు ఫోన్ చేసింది. ఆ డ్రైవర్ ఏం చేయొద్దని నాతో దురుసుగా ప్రవర్తించినా క్షమిస్తున్నానంటూ మళ్లీ రూటు మార్చింది. దీంతో నటి సంజన ప్రవర్తనపై నెటిజన్స్ మండిపడుతున్నారు.