హైదరాబాద్ లో మరో దారుణం.. ఏడేళ్ల చిన్నారి చేతులు కట్టేసి..!

Man Has Raped six-year-old girl in Khammam district - Suman TV

హైదరాబాద్ లో చిన్నారులపై వరుస అత్యాచారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని పార్శిగుట్ట ప్రాంతంలో ఓ ఏడేళ్ల చిన్నారి ఒంటరిగా కిరాణ షాపు కు వెళ్లింది.

కాపుకాసిన ఆటో డ్రైవర్ మల్లిఖార్జున్ బాలికకు చాక్లెట్ ఆశ చూపి ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. ఇక దారుణంగా ఆ చిన్నారి చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆ పాప వద్దు వద్దు అని అరుస్తూ కేకలు పెట్టింది. ఇక ఆ పాప అరుపులు గమనించిన స్థానికులు నిందితుడైన మల్లిఖార్జున్ ని చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.