పిల్లాడు చేసిన పనికి అవాక్కైన స్టాలిన్.. సైకిల్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ముఖ్యమంత్రి

మధురై (నేషనల్ డెస్క్)- పెద్ద మనస్సు అనేది పెద్దలకే కాదు.. చిన్న పిల్లల్లో కూడా పెద్ద మనసు ఉంటుందని నిరూపించాడు ఓ పిల్లవాడు. తన వయస్సు చినినదే అయినా తనకు విశాల హృదం ఉందని తెలియజెప్పాడు. సాధారనంగా చిన్నపిల్లకు ఎప్పుడూ ఆటలాడుకోవడం, ఆట వస్తువులు కొనుక్కోవడంపైనే ఆసక్తి ఉంటుంది. ఇదిగో తమిళనాడుకు చెందిన ఓ పిల్లవాడికి కూడా సైకిల్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు. కానీ సైకిల్ కోసం దాచుకున్న డబ్బులను ఏకంగా ముఖ్యమంత్రికే ఇచ్చేశాడు. ఏడేళ్ల వయస్సులోనే తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అసలు విషయానికి వస్తే.. మధురైలో హరీశ్ వర్మన్ అనే ఏడేళ్ల బాలుడు సైకిల్ కొనుక్కోడానికి డబ్బులు దాచుకుంటూ వస్తున్నాడు. సుమారు రెండేళ్ల పాటు దాచుకున్న డబ్బులతో సైకిల్ కొనుక్కోవడానికి సిద్దమయ్యాడు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులను చూసి పిల్లవాడి మనస్సు చలించిపోయింది.

cm stalin gift
Cm Stalin gifts a cycle

తాను దాచుకున్న డబ్బులను ఆపదలో ఉన్నవారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న డబ్బులను తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు సరాసరి ముఖ్యమంత్రి స్టాలిన్‌ కు ఓ లేఖ రాశాడు. తాను పంపుతున్న డబ్బును ఆపదలో ఉన్న కరోనా  పేషెంట్‌ చికిత్సకు ఖర్చు చేయాలని లేఖలో సీఎం ను కోరాడు. ఏడేళ్ల ఆ పిల్లవాడు రాసిన లేఖ, పంపిన డబ్బులు చూసి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆశ్చర్యపోయారట. వెంటనే తన సొంత డబ్బులతో సైకిల్ కొని హరీష్ వర్మన్ కు పంపించారు స్టాలిన్. ఈ సైకిల్‌ను స్థానిక ఎమ్మెల్యే ఆ పిల్లవాడికి అందించారు. ఇంకేముంది స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సైకిల్ ను చూశాక ఆ పిల్లవాడి ఆనందానికి అంతే లేదు. ఇక హరీష్ వర్మన్ కు ఫోన్ చేసిన సీఎం స్టాలిన్ కరోనా పరిస్థితుల నేపధ్యంలో జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలని చెప్పారట. ఇప్పుడు ఒక్క మధురైలోనే కాదు, తమిళనాడు వ్యాప్తంగా హరీష్ వర్మన్ హీరో అయ్యాడు.