సీఎం స్టాలిన్.. తను అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో గొప్ప ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారు. అయితే తాజాగా స్టాలిన్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేశారు. సమయాన్ని ఆదా చేయటంతో పాటు దుబార ఖర్చులను కూడా తగ్గించేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విషయం ఏంటంటే..? అసెంబ్లీ సముదాయం లో ఉన్న భోజన శాలను మూయించి వేసి ఖర్చులను, సమయాన్ని ఆదా చేసేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారట.
ఇక నుంచి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు వారి వారి ఇంటి నుంచే భోజనాలు తీసుకు రావాల్సి ఉంటుందని సీఎం స్టాలిన్ సూచించారు. ఈ నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాల సమయం వృధా కాకుండా జరగటం తో పాటు ప్రభుత్వ ఖర్చు కూడా బాగా తగ్గుతుందని సీఎం సూచించారు. దీంతో ఈ ఆదేశాలను వెంటనే అములు చేసేందుకు సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అయితే సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇక స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.