ఉద్యోగం కోల్పోతే తాత్కాలిక సాయం!.. కోవిద్ ఆపత్కాలంలో కేంద్రం గుడ్ న్యూస్!..

Atal Bimit Vyakti Kalyan Yojana - Suman TV

దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొన్ని వర్గాలను ఆదుకో పోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోకేంద్రం త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది.  కోవిద్ ప్రభావం వల్ల పలు సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. వీరిలో కొంతమందిని నిర్ధాక్షిణ్యంగా తొలగించగా, మరికొంతమందిని ఇంటి వద్దే ఉండి పని కల్పించేందుకు సంస్థలు అంగీకరించాయి. మరికొన్ని సంస్థలు సగం జీతం ఇస్తూ, మరో జీవనోపాధి వెతుక్కునే అవకాశం కల్పిస్తూ కొన్ని సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఏది ఏమైనా కొన్ని షరతులకు లోబడి ఇలాంటి వారిని గుర్తించి, కొంత సాయం చేసేందుకు కేంద్రం సంకల్పించింది. అయితే దీనికి కొన్ని నిబంధనలు విధిస్తూ అమలుకు చర్యలు తీసుకుంది.

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఈ మహమ్మారి వలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.  నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కరోనా వైరస్ కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి తీపికబురు తీసుకు వచ్చింది కేంద్రం. అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉద్యోగులకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటోంది కేంద్రం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అటల్ మీమిత్ వ్యక్తి కల్యాణ్యోజన పథకం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.

Atal Bimit Vyakti Kalyan Yojana - Suman TVఅయితే ఈ స్కీమ్ 2022 జూన్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఎవరైనా ఉపాధి కోల్పోయిన వారు కనుక ఉంటే వాళ్ళు అలవెన్స్ పొందొచ్చు. పరిస్థితుల ఇంకా అలానే కొనసాగుతుండటంతో 185వ ఈఎస్ఐసీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని వెల్లడించారు. ఉపాధి కోల్పోయిన వారికి ఈఎస్‌ఐ నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది. అదే విధంగా కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసీ మెడికల్ ఫెసిలిటీ 6 నెలల వరకు ఉంటుంది. ఈఎస్ఐ లబ్ధిదారులు ఉద్యోగం కోల్పోతే మూడు నెలల వరకు సగం జీతం ఇస్తారు. మూడు నెలల కాలంలో ఉపాధి కోల్పోయిన వారు మళ్లీ ఉద్యోగం సంపాదించుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు.

ఏదేని కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కోవిడ్‌–19 కారణంగా జాబ్‌ కోల్పోతే నెలరోజుల తర్వాత ఈ పథకానికి అర్హత సాధిస్తాడు. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా, ఈఎస్‌ఐసీ వివరాలతో ఆన్‌లైన్‌లో ఈఎస్‌ఐసీ పోర్టల్‌లో దర ఖాస్తు చేసుకోవచ్చు.

అప్ డేట్ వీడియో మీకోసం: