ఆనందయ్య మందు ఇప్పట్లో లేనట్టే! వెలుగులోకి సంచలన నిజాలు!

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కమ్మేసింది. ఎటు చూసినా ప్రజల ఆర్తనాదాలే. సరైన వైద్య సదుపాయాలు లేవు, సదుపాయాలు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలకి లక్షలు గుంజేస్తున్నాయి. ఇంతా చేస్తే.. బతుకుతామన్న గ్యారంటీ లేదు. ఇలాంటి సమయంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకి ఆయుర్వేద మందు కనిపెట్టారు. దీన్ని ఆయుర్వేద మందు అనేకన్నా సంజీవని అనవచ్చు. ఎందుకంటే మృత్యువు ఒడిలో ఉన్న వారిని కూడా ఈ ఆయుర్వేద మందు బతికించింది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయిన వారిని కూడా గంటల వ్యవధిలో యధా స్థితికి తీసుకొచ్చింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం, వాడిన రెండు రోజుల్లోనే కరోనా నెగిటివ్ వస్తుండటంతో ప్రజలు ఈ ఆయుర్వేద మందు కోసం ఎగబడ్డారు. సుమారు 80000 మందికి ఆనందయ్య ఈ మందుని అందించారు. ఎక్కడా కూడా ఈ మందు గురించి సింగిల్ కంప్లైంట్ రాలేదు. కానీ.., ఆనందయ్య మందులో శాస్త్రీయత లేదని.., దీన్ని పరిశీలించాలని ప్రభుత్వం ఆయర్వేద మందు పంపిణీ ఆపేసి ఇప్పటికే వారం అయ్యింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ఏమిటిటంటే ఆనందయ్య ఆయుర్వేద మందు ఇప్పట్లో ప్రజలకి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు.

ANADAYYA1ఆనందయ్య మందుపై సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అధ్యయనం చేపట్టింది. విజయవాడలోని ఆయుర్వేద పరిశోధన సంస్థతో పాటు.., తిరుపతి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ఇందుకు సహకారం అందిస్తున్నాయి. అయితే.., ఈ అధ్యయనానికి ప్రజల నుండి మద్దతు లభించడం లేదట. ఆనందయ్య మందు వాడిన 500 మంది వ్యక్తుల నుండి సమాచారం సేకరించి ఒక అంచనాకి రావాలని అధికారులు భావించారు. తమకు అందిన సెల్ఫోన్ నంబర్ల ఆధారంగా రోగులు, వారి బంధువులకు సోమవారం నుంచి ఫోన్ చేయడం ప్రారంభించారు అధికారులు. ఈ లిస్ట్ లో 92 మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. 42 మంది తాము అసలు మందు తీసుకోలేదని అబద్దం చెప్పారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మరో 36 మంది ఒకే నంబరు ఇచ్చారు. ఇక స్పందించిన కొంత మంది మాత్రం అసలు తమకి కరోనా రాలేదని.., ముందు జాగ్రత్తగా ఆనందయ్య మందు వాడమని చెప్పడంతో షాక్ అవ్వడం అధికారుల వంతు అయ్యింది. దీంతో.., ప్రభుత్వానికి నివేదిక ఎలా అందించాలని ఆయుర్వేద సంస్థల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆనందయ్య దగ్గర సుమారు 80 వేల మంది ఔషధం తీసుకున్నట్లు అంచనా. కానీ.., తన వద్దకు వచ్చిన వారి నుంచి ఆయన ఎలాంటి వివరాలు సేకరించలేదు. దీంతో.., ఆనందయ్య ముందుకి క్లియరెన్స్ రావాలంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.