కరోనా సెకండ్ వేవ్ ఇండియాని దారుణంగా దెబ్బ తీసింది. ప్రజలను ఆర్ధికంగా, మానసికంగా, ఆరోగ్య పరంగా అన్నీ విధాలా కృంగతీసింది. బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు సైతం గాలిలో కలసి పోయాయి. ఇలాంటి సమయంలో నెల్లూరు కృష్ణపట్నంలో కరోనాకి ఆయుర్వేద మందు పుట్టికొచ్చింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం 2 రోజుల్లోనే మహమ్మారి తగ్గు మొహం పడుతుండటంతో ఈ ఆయుర్వేద మందుకి మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా.., జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో అందిస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని పరిశీలించారు. దీనిపై మెడికల్ ట్రయల్స్ పూర్తి చేశారు. మెడికల్ టెస్ట్ లో నెల్లూరు ఆయుర్వేద మందు వియజయం సాధించింది. దీనితో జిల్లా అధికారులు సైతం ఆయుర్వేద మందు పంపిణీకి పాక్షిక అనుమతి ఇచ్చారు. ఈ ఆయుర్వేద మందు వాడితే… కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, పాజిటివ్ వచ్చినప్పుడు సీటి స్కాన్ లో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా.., ఈ మందు వాడిన తరువాత కేవలం రెండు రోజుల్లోనే నార్మల్ రిపోర్ట్స్ రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం వంటి అద్భుతాలు ప్రజల కళ్ళ ముందే జరిగాయి. దీంతో.., నెల్లూరు జిల్లా వైపు దేశం అంతా తిరిగి చూస్తోంది.
నెల్లూరు ఆయుర్వేద మందు అద్భుతంగా పని చేస్తుండటంతో నెల్లూరు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఇన్ని రోజులు లక్షలకి లక్షలు హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టుకుని.., బతుకు జీవుడా అంటూ గడిపిన పేషంట్స్ అంతా ఈ మందు కోసం కృష్ణపట్నంకి పరుగులు తీస్తున్నారు. దీంతో.., జిల్లా వ్యాప్తంగా హాస్పిటల్స్ లో బెడ్స్ అన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. నెల్లూరు, కావలి, గూడూరు పరిసర గ్రామాల నుండి మాత్రమే కాక.., పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడ బారులు తీరుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఆనందయ్య ఈ మందుని కనిపెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ కి కొన్ని వందల కోట్ల ఆదాయానికి గండి కొట్టారు. ఈ డబ్బంతా ఆయన ప్రజలకి మిగిల్చినట్టే కదా? దీనితో ఆనందయ్యకి మెడికల్ మాఫియా నుండి ప్రాణ హాని ఉండొచ్చు, ప్రభుత్వం ఆయనకి రక్షణ కల్పించాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.