టోల్‌గేట్‌ సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన లారీ డ్రైవర్‌

Lorry

Viral Video: అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో బన్నీ ‘‘పుష్పరాజ్‌’’ అనే క్యారెక్టర్‌ చేశారు. ఆయన ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేసే స్మగ్లర్‌గా కనిపించారు. ‘‘తగ్గేదేలా..’’ అన్న ఊతపదంతో సినిమాలో ఎవ్వరినీ లెక్కచేయకుండా ప్రవర్తిస్తుంటారు. పోలీసులను సైతం ముప్పతిప్పలు పెడుతుంటారు. మరి, ఓ లారీ డ్రైవర్‌ తనను తాను ‘‘పుష్పరాజ్‌’’ అనుకున్నాడో ఏమో.. టోల్‌ గేట్‌ సిబ్బందికి 70 ఎమ్‌ఎమ్‌ సినిమా చూపించాడు. లారీలో ఏం స్మగ్లింగ్‌ చేస్తున్నాడో ఏమో.. టోల్‌ గేట్‌ వద్ద ఆపకుండా పరుగులు పెట్టించాడు. లారీని ఆపటానికి దాని ముందు భాగంలో ఎక్కిన టోల్‌ ప్లాజా సిబ్బందిని 10 కిలోమీటర్లు తీసుకెళ్లిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన ఓ లారీ కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. సాధారణంగా వాహనాలు ఏవైనా టోల్‌ గేట్ల దగ్గర ఆపి, ఫీజు కట్టి కదలాల్సి వస్తుంది. అయితే, సదరు లారీ డ్రైవర్‌ అలా చేయలేదు. లారీని గుత్తి టోల్‌ గేట్‌ వద్ద ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో గుత్తి టోల్‌ గేట్‌ సిబ్బంది కర్నూలు జిల్లాలోని అమకతాడు టోల్‌గేట్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. లారీ అమకతాడు టోల్‌ గేట్‌ దగ్గరకు రాగానే అక్కడి సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్‌ లారీని ఆపినట్లే ఆపాడు.Lorryఈ నేపథ్యంలో టోల్‌ గేట్‌ సిబ్బంది అయిన శ్రీనువాసులు లారీ ముందు భాగంలోకి ఎక్కాడు. శ్రీనువాసులు లారీ ముందు భాగంలోకి ఎక్కిన మరుక్షణమే లారీ డ్రైవర్‌ మరో ఆలోచన చేయకుండా లారీని ముందుకు దూసుకుపోనిచ్చాడు. నలుగురు సిబ్బంది లారీ వెంట పడి ఆపమని ప్రాథేయపడుతున్నా ఆపలేదు. అలా 10 కిలోమీటర్లు దూసుకుపోయాడు. వెల్దుర్తి దగ్గర పోలీసులు లారీని ఆపి, శ్రీనువాసుల్ని కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.


ఇవి కూడా చదవండి : ఆర్టీవో కాళ్లపై పడ్డ కుటుంబం.. కన్నీళ్లతో వేడుకోలు!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.