గత వారం పది రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ఏపీ సహా తమిళనాడు రాష్ట్రాలు చిగురుటాకుల వణుకిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు నిండిపోయి వరద ఉధృతి తీవ్ర తరమవుతోంది. అయితే జోరుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీలోని కొన్ని గ్రామలు సైతం మంపునకు గురయ్యాయి. ఇక ఇదే కాకుండా భారీగా ప్రాణనష్టం జరిగిందని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. ఇక వరద నీరు భారీగా వస్తుండడంతో జలాశయం గేట్లు ఎత్తేస్తున్నారు.
కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షాలకు కడప జిల్లాలోని కమలాపురంలోని పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వంతెన సుమారుగా ఏడు మీటర్ల మేర కలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అటుగా ఈ వంతెన కూలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గాన్ని పునరుద్దరించటానికి మాములుగా ఒక నెల సమయం పడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు.