శ్రీరాముడి కంట నీరు.. భక్తుల ఆందోళన!

మన దేశంలో అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు, వినాయకుడు పాలు తాగుతున్నాడని.. సాయిబాబ నుదుటి నుంచి విభూది రాలుతుందని.. కొంత మంది దేవతా మూర్తుల కంట కన్నీరు కారుతుందనే వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడులో ఇలాంటి చోటుచేసుకుంది. రామాలయంలో సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు కారుతుంది. రెండేళ్ళుగా సీతారాముల కళ్యాణం నిర్వహించకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు భావిస్తున్నారు.

asdgvaseg minఈ వార్త చుట్టుపక్కట గ్రామస్థులకు తెలియంతో ఆందోళన చెందుతున్నారు. దేశంలో పాపాలు పెరిగిపోతున్నాయని.. ఈ నేపథ్యంలో రాములోరు కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ రకరకాలుగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని మునగపాడులో రాముల వారికి పూజ చేద్దామని పూజారి సిద్ధమైతే.. ఆ సమయంలో సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందారు. రాములోరు కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ రకరకాలుగా చెబుతున్నారు.

fasre minఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం చింతపండు రసంతో విగ్రహాలకు ఉన్న ఇత్తడి కళ్ళు తుడవడం వల్ల ఇప్పుడు నీరు కారుతున్నాయేమో అంటూ ఆలయ పూజారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీతారాముల విగ్రహాల నుంచేకాక లక్ష్మణ, హనుమ విగ్రహాల నుంచి కూడా ఇలాగే నీరు కారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే తమ గ్రామానికి ఎలాంటి అరిష్టం వాటిల్లకుండా చూడాలని రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కోసం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.