టమాట ధర చూస్తుంటే నో”టమాట” రావటంలేదు

biryani tomato

సామన్య ప్రజలకి టమాట, పెట్రోల్ పరుగు పందె పెట్టుకున్నాయా అన్నట్లుంది వాటి ధరల పెరుగుదలను చూస్తుంటే. ఇప్పటి వరకు తాబేలు నడక లాగా ఉన్న టమాట ధర అమాంతం కుందేలు లాగా పరిగెడుతుంది. పెట్రోల్,టమాట రెండు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి లేకపోతే ముందుకు సాగలేము.. మరొకటి ఉండకపోతే నోటికి ముద్ద పోదు. ఈ రెండిటి మధ్యలో సామన్యుడు అల్లాడుతున్నాడు.

ప్రస్తుతం టమోటా ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. తమిళనాడులో అయితే 150 రూపాయలకు కిలో టమోటా అమ్ముతున్నారు. దీంతో ప్రజలు టమాటాలు కొనడం మానేశారు. భోజన ప్రియులైతే ఈ టమాటలు కొన్నడం కంటే బిర్యాని కొనడం మేలనుకుంటున్నారు. టమాట ధరలను చూసి చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు ఓ ఆఫర్ పెట్టినారు. ఆ అఫర్ బాగా సక్సెస్అయింది. అది ఏమిటంటే కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఓ కిలో బిర్యానీ ఉచితంగా ఇస్తామని లేదా ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఉచితంగా ఇస్తామన్నారు. ఆ హోటల్ నిర్వహకుడు ఆ ఆఫర్ పెట్టడానికి కారణం కూడా వుంది. వర్షాలతో అల్లాడిన చెన్నైలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా అక్కడ కేజీ రూ.130లకు పైగా పలుకుతుంది.

biryani toamtoఈ నేపధ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం సమీపంలోని అంబూర్ బిర్యానీ హోటల్ యజమాని తన అమ్మకాలు పెంచుకోవడం కోసం ఈ ఆఫర్ ప్రకటించారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. అంబూర్ బిర్యానీ హోటల్ లో ఒక కేజీ బిర్యానీ వంద రూపాయిలు.. ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో జనం క్యూ కట్టారు. దీంతో యజమాని పంట పండింది. బిర్యానీకీ బాగా గిరాకీ పెరిగింది. మరొక ప్రాంతం వాణింబాడిలో రెండు బిర్యానీలు కొంటే కేజీ టమాటా ఫ్రీగా ఇస్తున్నారు. టమాట ధర ఆకాశాన్ని తాకడంతో ఇలాంటి కొత్త కొత్త ఆఫర్ లు మరేన్ని పుట్టుకోస్తాయో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేండి.