మూడు రాజధానుల నిర్ణయంపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

raghurama

మూడు రాజధానుల నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక ఉన్నట్టుండి ఈ బిల్లు రద్దు వెనక ఏం జరిగిందనే వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇదే విషయంపై రాజకీయాలకు అతితంగా నేతలు స్పందిస్తున్నారు.

అయితే తాజాగా నర్సాపురం వైసీసీ రెబల్ ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని, ఈ పదవిలోకి వస్తూ పోతూ ఉంటారని రాఘురామ అన్నారు. ఇక 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏది పడితే అది చేస్తే చెల్లదని, మూడు రాజధానులు అనేది పార్లమెంట్ చేసిన చట్టానికి వ్యతిరేకం అని రఘురామ అన్నారు. ఈ మూడు రాజధానుల రద్దు నిర్ణయం ఖచ్చితంగా ప్రజల విజయమేనని ఆయన అన్నారు.

కాగా ఇటీవల తిరుపతిలో అమిత్ షాతో జగన్ కలిసిన తర్వాత ఈ విషయం గురించి ఇద్దరు చర్చించుకున్నారని, దీని తర్వాతే జగన్ ఇలా నిర్ణయం తీసుకున్నారంటూ రఘురామ తెలిపారు. అయితే ఈ మూడు రాజధానుల అనేది జగన్ పిచ్చి నిర్ణయమని, ఏకైక రాజధాని ఏర్పాటే ముఖ్యమని రఘురామ అన్నారు. ఇక దీంతో పాటు విద్యార్ధుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎయిడెడ్ విద్యా సంస్థలపై కూడా ప్రభుత్వం ఆలోచించాలని రఘురామ సూచించారు. ఇక తాజాగా జగన్ తీసుకున్న సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.