రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆన్‌లైన్ టికెట్లు ప్రభుత్వం విక్రయించడంపై పవన్‌కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై మంత్రి పేర్ని నాని దిల్‌రాజుతో కలిసి బుధవారం ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ.. చిరంజీవి తనతో మాట్లాడారని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని అన్నట్లు ఆయన తెలిపారు. సినీ పెద్దలు తమ వద్దకు వచ్చి ఆన్‌లైన్ సినిమా టికెట్ల అంశంపై చర్చించారని అన్నారు.
త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని థియేటర్లు తెరిచి సినీ పరిశ్రమను ఆదుకోవాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ ఉండి, ఆంధ్రాలో లేకుంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యుటర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ అంశాన్ని పరిగణంలోకి తీసుకుని సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సినీ పెద్దలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, లవ్‌స్టోరీ సినిమా నిర్మాత మంత్రితో పాటు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.