ఈ రోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నేనుప్పుడు హద్దులు దాటి మాట్లాడలేదు. నా తల్లితండ్రులు ఆ సంస్కారాన్ని నేర్పించారు. ఇకనుంచి భయం అంటే ఏంటో వైసీసీ నేతలకు చూపిస్తా. రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే వ్యక్తిగత జీవితం గురించి తీస్తారెందుకు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడుందని పవన్ ప్రశ్నించారు.
నా హక్కులకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరకోనంటూ స్పష్టం చేసారు. తాను వివేకా హత్య…కోడి కత్తి కేసు గురించి మాట్లాడితే సమాధానం చెప్పరు.. కానీ నా పై విమర్శలు మాత్రం బాగా చేస్తున్నారు. ఈ సన్నాలు, దద్దమ్మలు, వాజమ్మలు అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. బయటకి లాక్కొచ్చి మరీ కొడతాం అన్నారు పవన్. అలాంటి వారికి సరైన పద్దతిలో బుద్ది చెబుతామని.. మితిమీరిన వ్యాఖ్యలు చేస్తే వారిని చట్ట ప్రకారంగా కూడా ఎదుర్కొంటామని అన్నారు. ఆ బాధ్యత జనసేన తీసుకుంటుందని అన్నారు.
ఇక వైసీపీ కి భయం అంటే ఏంటో తెలియదని.. అది తెలిసేలా చేస్తానని హెచ్చరించారు. మీరు తిట్టిన కొద్దీ నేను బలపడతాను, తప్ప బలహీనపడను. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా..! ఎవర్నీ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు.. రాజకీయాల్లో కలుపుమొక్కల్ని తీసేయాలి.