ఇక సెకన్లలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.. ఫోన్ కూడా చేయక్కర్లేదు!

Gas Central Governament India

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మధ్యకాలంలో గ్యాస్ బుకింగ్ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో మొబైల్ ద్వారా ఏజెన్సీ నంబర్ కు కాల్ చేసి మన బుకింగ్ నంబర్ ఎంటర్ చేసి బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే టెక్నాలజీలో మార్పులు వస్తుండటంతో బుకింగ్ లో కూడా మార్పులు తీసుకొస్తున్నాయి. దీంతో పాటు ప్రతీ ఒక్క గ్యాస్ వినియోగదారుల వద్ద కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు గ్యాస్ బుకింగ్ అనేది క్షణాల్లో పూర్తవుతుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ ఫెసిలిటీని అందిస్తున్నాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సంబంధించి భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా సరే వాట్సాప్ ద్వారా సులభంగానే క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీని మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది.

ఇండెన్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:

Gas Central Governament India

మీరు ఇండెన్ గ్యాస్ వాడితే.. 7588888824 అనే నెంబర్ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి.

తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి.

ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి.

క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది.

భారత్ గ్యాస్ బుకింగ్ చేసే విధానం:

భారత్ గ్యాస్ ఉపయోగించే వారు 1800224344 నెంబర్ను వారి మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలి.
తర్వాత వాట్సాప్లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. ఆ తర్వాత మీకు రిప్లే వస్తుంది అనంతరం మీరు సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

HP గ్యాస్ బుకింగ్ చేసే విధానం:

హెచ్పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు 9222201122 నెంబర్ ద్వారా వాట్సాప్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.ఇక వాట్సాప్ ప్రొఫైల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు ఉంటాయి. వినియోగదారులు వాటిని ఫాలో అయితే సరిపోతుంది.