మీ ఇంట్లో సిలిండర్ లో గ్యాస్ అయిపోతుందా? కొన్ని రోజుల్లో అవ్వడానికి సిద్ధంగా ఉందా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. మీరు గనుక సిలిండర్ ను చేసుకోవాలి అని అనుకుంటే గనుక ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే రూ. 200 వరకూ తగ్గింపు లభిస్తుంది.
గ్యాస్ సిలిండర్ పై రూ.200 తగ్గింపు పొందవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఒక ఆఫర్ ను ఉపయోగించుకుంటే మీరు రూ. 200 తగ్గింపుతో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి పలు యాప్స్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేస్తుంటారు. అయితే ఫ్లిప్ కార్ట్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే మీకు రూ. 200 తగ్గింపు లభిస్తుంది. కొన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లలో షాపింగ్ చేయడం ద్వారా రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ లు వంటివి వస్తుంటాయి. వీటితో మళ్ళీ షాపింగ్ చేసుకునే వీలు ఉంటుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ తో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే రూ. 200 వరకూ తగ్గింపు లభిస్తుంది.
మీకు ఆన్ లైన్ లో షాపింగ్ చేసే అలవాటు ఉంటే గనుక.. ఫ్లిప్ కార్ట్ లో షాపింగ్ చేసి ఉంటే గనుక మీ ఖాతాలో సూపర్ కాయిన్స్ అనేవి ఉంటాయి. ఈ సూపర్ కాయిన్స్ ని ఉపయోగించుకుని గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే మీకు అందులో కూడా డిస్కౌంట్ లభిస్తుంది. దీని కోసం మీరు ఫ్లిప్ కార్ట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో సూపర్ కాయిన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సూపర్ కాయిన్ పే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎల్పీజీ బుకింగ్ బటన్ ను ఎంచుకోవాలి. ఎల్పీజీ బుకింగ్ ను ఎంచుకున్న తర్వాత ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో గ్యాస్ కంపెనీ పేరుని ఎంచుకోవాలి. గ్యాస్ సిలిండర్ ఏ నంబర్ తో అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ నంబర్ ను ఎంటర్ చేయాలి. తర్వాత మేక్ పేమెంట్ అనే బటన్ పై క్లిక్ చేస్తే గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందో కనిపిస్తుంది.
కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎంత డబ్బు చెల్లిస్తున్నారో అనేది కనబడుతుంది. అక్కడే గ్యాస్ సిలిండర్ మీద ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ సూపర్ కాయిన్స్ ఎన్ని ఎక్కువ కాయిన్స్ ఉంటే అంత డిస్కౌంట్ లభిస్తుంది. సపోజ్ 700 పైన సూపర్ కాయిన్స్ ఉంటే గ్యాస్ సిలిండర్ పై రూ. 200 వరకూ తగ్గింపు వస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 1150 గా ఉంది. సూపర్ కాయిన్స్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే గనుక రూ. 200 వరకూ తగ్గుతుంది. ఫ్లిప్ కార్ట్ లో షాపింగ్ చేయడం ద్వారా సూపర్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ సూపర్ కాయిన్స్ తో మళ్ళీ షాపింగ్ చేయవచ్చు.