నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యింది. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్, ఇంధన ధరల్లో మార్పులు చేస్తాయి. ఈ నెల నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దాంతో చమురు కంపెనీలు గ్యాస్ ధరలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ వివరాలు..
నెల మారుతూనే.. కొన్ని వస్తువులు ధరలు తగ్గడం, పెరగడం వంటివి జరుగుతాయి. మరీ ముఖ్యంగా ఇంధన ధరల్లో మార్పులు ఉంటాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. చాలా వస్తువులు, సర్వీస్‌ల ధరలు పెరగడం, కొత్త పన్నులు ప్రారంభం అవ్వడం వంటివి చోటు చేసుకుంటాయి. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త స్లాబ్ ట్యాక్స్‌లు నూతన ఆర్థిక సవంత్సరం ప్రారంభం నుంచి మొదలవుతాయి. ఇక టోల్ చార్జీలు మోత అర్థరాత్రి నుంచే ప్రారంభం అయ్యింది. ఇక ప్రతి నెల ప్రారంభం నుంచే చమురు కంపెనీలు గ్యాస్, ఇంధన ధరలు పెంచడం, తగ్గించడం వంటివి చేస్తాయి. ఇప్పుడు ఏకంగా ఆర్థిక సంవత్సరం మారింది. దాంతో గ్యాస్, ఇంధన ధరలు తగ్గిస్తాయని ప్రజలు భావించారు. కానీ కేంద్రం మాత్రం కరుణించలేదు.
ఇక గత కొన్నినెలలుగా గ్యాస్ రేట్లు పెంచిన కేంద్రం.. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన సందర్భంలో కూడా గ్యాస్ రేట్లను తగ్గించింది. అయితే ఏ గ్యాస్ ధరలు తగ్గించింది.. ఎంత మేర తగ్గించింది అంటే.. కేంద్ర గ్యాస్ ధరల్ని రూ.92 మేర తగ్గించింది. అయితే కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గించింది. గృహ వినియోగదారులు వాడే సిలిండర్ ధర రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధర తగ్గిస్తుంది అని ఆశించిన జనాలకు భారీ నిరాశ మిగిలింది.
ఇక తాజాగా కేంద్రం కేవలం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరల్ని మాత్రమే స్వల్పంగా తగ్గించింది. ఇక 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. గత నెలలో డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచగా.. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను కూడా గత నెలలో ఏకంగా రూ.350 పెంచింది. ఇప్పుడు మాత్రం కేవలం రూ.92 మాత్రమే తగ్గించింది. కేంద్ర నిర్ణయంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి గ్యాస్ ధరల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.