ఇకపై అసెంబ్లీలోకి సెల్‌ఫోన్ల అనుమతి లేదు : ఏపీ స్పీకర్

ఏపి అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారం కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా శాసనసభలో సెల్ ఫోన్ల వినియోగం వద్దని సభ్యులకు ఏపీ స్పీకర్ సూచించారు. ఈమేరకు ఏపీ శాసనసభలోకి సభ్యులెవరూ సెల్ ఫోన్లను తీసుక రావొద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఈ నెల19న అసెంబ్లీలో చద్రబాబు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేశారు. అయిన తెదేపా సభ్యులు అక్కడి సంఘటన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై వివాదం కూడా చెలరేగింది. ఆ అనుభవంతో స్పీకర్ తమ్మినేని ఈ ప్రకటన చేశారు.

image 1 compressed 21అసెంబ్లీ నిబంధనల ప్రకారం శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు… సభలో.. ఏమైనా అనుకొని ఘటనలు, వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి జరిగినప్పుడు వాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను బయటకి రాకుండా జాగ్రత్త పడతారు. ఏమైనా వివాదస్పదమైన మాటలు ఉంటే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తారు. కారణం అసెంబ్లీ జరిగిన కొన్ని సంఘటనలు బయట ఘర్షణలు దారితీయవచ్చు. అంతే కాక అవి అసెంబ్లీ రికార్డుల్లో ఎప్పటికీ ఉంటాయి.

image 2 compressed 20ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు లైవ్ లోకి వెళ్లకుండా స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేశారు. కానీ అక్కడ ఉన్న టీడీపీ నేతలు…చంద్రబాబు మాటలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకే అసెంబ్లీలో సెల్ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఏపీ స్పీకర్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.