ఆంధ్రప్రదేశ్‌బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. ఆ వివరాలు.. సోమవారం సభలో జీవో నెంబర్ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ చెప్పినా కూడా వాళ్లు వినకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని సమాచారం. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారకుండా ముందు జాగ్రత్త చర్యగా సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. ఇక ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు.
సోమవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు.. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.. ప్లకార్డులను ప్రదరించారు. ఈ క్రమంలోనే ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు.. స్పీకర్ ముఖంపై ప్లకార్డు ప్రదర్శించారు. దాంతో స్పీకర్ తమ్మినేని సీతారాం.. దాన్ని పక్కకు తోసేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్‌కు రక్షణగా పోడియం దగ్గకు వెళ్లారు. దాంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే లు కొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్ 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.