జగన్ గారు ఇంకోసారి ఆలోచించండి.. చిరు ట్వీట్ వైరల్!

Chiranjeevi Tweet to CM Jagan - Suman TV

ఏపీలో సినిమా టికెట్లు అమ్మకం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగనున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏ స్థాయి సినిమా అయినా రోజుకు నాలుగు షోలే వేయాలి. అందుకు టికెట్‌ ధర కూడా ఒకటే ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం. బ్లాక్‌ టికెట్‌, బెనిఫిట్‌ షోల దందాను కట్టడి చేసేందుకు, పారదర్శకత కోసం బిల్లును చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ కు ట్విట్టర్‌ వేదికగా ఒక విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి విన్నపం..

బిల్లుకు సంబంధించి సీఎం జగన్‌ కు చిరంజీవి తన విన్నపాన్ని తెలియజేశారు. ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ బిల్లు ప్రేవశ పెట్టడం హర్షించదగ్గ విషయమన్న చిరంజీవి.. కాలానుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రస్తావించారు. ఇలా చేస్తే సినిమావాళ్లకి, ఇండస్ట్రీ మనగలుగుతుంది అంటూ సూచనలు చేశారు. దేశం మొత్తం ఒకే ట్యాక్సు తరహాలోనే సినిమా టికెట్లు కూడా ఒకేలా ఉండేలా చూడాలంటూ కోరారు. ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.