అతి తక్కువకాలంలోనే రికార్డు సృష్టిస్తోన్న కియా కారు అమ్మకాలు!..

Kia Cars Sales Record - Suman TV

ఆగస్టు 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా సెల్టోస్ ఆనతి కాలంలోనే అత్యధిక విక్రయాలను అందుకున్న కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేకాకుండా భారత విపణిలో అత్యుత్తమంగా అమ్ముడుపోతున్న ఎస్ యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. 2020 జనవరిలో కియా సెల్టోస్ 15,000 యూనిట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కొన్ని కారణాల వల్ల అంతకుముందు నెలతో పోలిస్తే కొద్దిగా అమ్మకాలు తగ్గినప్పటికీ దీని క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం, మల్టిపుల్ గేర్ బాక్స్, అదిరిపోయే ఫీచర్లతో కియా సెల్టోస్ ఆకట్టుకుంటోంది. అతి తక్కువ కాలంలోనే ఆటోమొబైల్‌ మార్కెట్‌పై చెదరని ముద్ర వేసిన కియా తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది.

Kia Cars Sales Record - Suman TVకియా కంపెనీ నుంచి వస్తున్న ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఒకదాని వెంట ఒకటిగా అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి.  కియా సోనెట్‌లో 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌తో వస్తోంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్లు అందిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర రూ. 6.79 లక్షల నుంచి గరిష్టంగా రూ. 8.75 లక్షలు(షోరూమ్‌)గా ఉంది. గత సెప్టెంబరులో తొలి మోడల్‌ రిలీజ్‌ అవగా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ 2021 మేలో మార్కెట్‌లోకి వచ్చింది. మొత్తంగా 17 రంగుల్లో ఈ కారు లభిస్తోంది. ఎలక్ట్రానిక్‌ స్టెబులిటీ కంట్రోల్‌ , వెహికల్‌ స్టెబులిటీ మేనేజ్‌మెంట్‌ ,  బ్రేక్‌ అసిస్ట్‌ ,  హిల్‌ అసిస్ట్ కంట్రోల్‌ ,  పెడల్‌ షిప్టర్స్‌, వాయిస్‌ కమాండ్‌ ఆపరేటెడ్‌ సన్‌ రూఫ్‌ తదితర ఫీచర్లు ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.