పవన్ కళ్యాణ్  కోటి రూపాయలు సహాయం! ఇలాంటి వార్తలు మీడియాకి పట్టవా?

pawan kalyan

పవన్‌ కల్యాణ్‌.. పవర్‌ స్టార్‌.. జనసేన అధినేత.. పేరు మారుతుందేమో గానీ ఆయనకున్న మాస్‌ ఫాలోయింగ్‌ మాత్రం మారదు. సినిమా చేసినా, రాజకీయం చేసినా.. ఆయన తీరే వేరు. హీరోగా, రాజకీయ నాయకుడిగా కంటే సాధారణ భారతీయ పౌరుడిగానే పవన్‌ కల్యాణ్‌కు అభిమానులు ఎక్కువ. ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించడం. పేదలకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం.. నిస్సాహుయుల కోసం పోరాడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. సామాజిక అంశాలపై ఎప్పుడూ పవన్‌ తనదైనశైలిలో స్పందిస్తుంటారు. ఆయన చేసే పనుల్లో కనీసం 10 శాతం కూడా బయటకురావడం లేదంటూ అభిమానులు ఆరోపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వానికి ఎందరో అభిమానులు ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ని దేవుడిగా కొలుస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం వారికి ఎంతగా నచ్చి ఉండాలి. దేశంకోసం పాటుపడిన వారిని ఎప్పుడూ పవన్‌ మర్చిపోరు. తాజాగా చేసిన ఒక పని అదే విషయాన్ని నొక్కి చెప్తోంది.

ఇదీ చదవండి: ఏసర్‌ ఇండియాపై సైబర్‌ ఎటాక్‌? 50 జీబీ యూజర్‌ డేటా చోరీ చేసినట్లు హ్యాకర్ల ప్రకటన!

విషయం ఏంటంటే.. దివంగత నేత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చేందుకు ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘నిత్య స్మరణీయులు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి జనసేన పక్షాన సంకల్పించాం. ఇందుకోసం కోటి రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం’ అంటూ ట్వీట్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత సంజీవయ్య రేండేళ్లలో సీఎంగా చేసిన కృషిని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇలాంటి వార్తలు మీడియాకి పట్టవా ఎందుకు ఇలాంటి వార్తలు రాయరు అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. పవన్‌ నిధిని ఏర్పాటు చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.