తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ సందడి!

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్. శుక్రవారం రాజమండ్రికి రానున్నారు చిరంజీవి. శనివారం పవన్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపడుతుండగా, అభిమానులు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలకు రానున్నారు చిరంజీవి.

pawankalyan minఆస్పత్రి ఆవరణలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విగ్రహావిష్కరణ చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఘనస్వాగతం చెప్పేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు అభిమానులు.

paragaqj minచిరు టూర్‌ ఇలా ఉంటే, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు పవన్. అక్టోబర్ రెండో తేదీన రాజమండ్రిలో పవన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు. రోడ్ల శ్రమధానంలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు రానున్నారు జనసేనాని. రోడ్ల దుస్థితి పరిశీలించి శ్రమదానం చేయనున్నారు పవన్‌కళ్యాణ్. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే జనసేన నాయకులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత కల్పించాలని కోరారు.