టీడీపీ నేత బుద్ధా వెంకన్న Jr.యన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతల వ్యవహారంపై చంద్రబాబు సైతం కన్నీరు పెట్టారు. దీనిపై పార్టీలకతితంగా కూడా నేతలు కొందరు స్పందించి చంద్రబాబకు మద్దతు తెలిపారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు చేస్తున్నారు. వర్ల రామయ్య ఇప్పటికే విజయవాడలో దీక్ష చెపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు విమర్శలు చేశారని, వీరి విమర్శలపై జూనియర్ యన్టీఆర్ స్పందించిన తీరు సరిగ్గా లేదంటూ అభిప్రాయపడ్డారు. యన్టీఆర్ మేనత్తను ఇష్టమొచ్చినట్లు అంటుంటే ఆయన స్పందించిన తీరులో ఆయన విఫలమయ్యారని వర్ల రామయ్య తెలిపారు.
ఇక ఇప్పుడు వర్ల రామయ్యకి తోడుగా బుద్దా వెంకన్న కూడా వాయిస్ పెంచారు. మేనత్త పై కామెంట్స్ చేసిన కొడాలి నాని, వల్లభనేని నీకు సన్నిహితులు. వారి మాటలను నేరుగా ఖండించకుండా, చాగంటి గారి ప్రవచనాలు చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయావు. దీని కన్నా నీవు స్పందించకుండా ఉంటే బాగుండేది. ఇలాంటి ప్రవచనాలు పార్టీకి అవసరం లేదు. మీ నుండి కోరుకునేవి ఇలాంటి ప్రవచనాలు కాదు అంటూ బుద్ధా వెంకన్న ఓపెన్ కామెంట్స్ చేయడం అందరిని షాక్ కి గురు చేస్తోంది. అయితే.., తారక్ పై కామెంట్స్ చేసిన నేతలు అందరు.. ఇవి తమ వ్యక్తిగత కామెంట్స్ అని, పార్టీకి సంబంధం లేదని క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనా.. టీడీపీ నేతలు యన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.