హీరో నాని నటించిన ‘నేనులోకల్’ సినిమా గుర్తుందా.. పోలీస్ స్టేషన్ లో పోలీస్ కి ఓ కుర్రాడు తన పెన్సిల్ పోయిందని ఫిర్యాదు చేస్తాడు.. ఎలా పోయిందని పోలీస్ అడుగుతాడు.. చాక్ మార్ లో పెట్టి తిప్పాను కనిపించకుండా పోయిందని అంటాడు… ఈ సన్నివేశం చూసి థియేటర్లో కడుపుబ్బా నవ్వుకున్నారు. తాజాగా ఇలాంటి ఆసక్తికర సంఘటన కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నలుగురు పిల్లలు పోలీసు స్టేషన్ కి వచ్చారు. ఈ నలుగురు కూడా వారి పెన్సిల్ గొడవని పోలీసులకు చెబుతుండగా పోలీసులు అందుకు సంబంధించిన వీడియోని రికార్డు చేశారు. తన పెన్సిల్ పోయిందంటూ.. పక్కనే ఉన్న మరో పిల్లవాడిని చూపిస్తూ తన పుస్తకాలు, పెన్సిల్ ఎత్తుకెళ్లాడని, రోజూ ఇలాగే చేస్తుంటాడని ఆ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు రా అని పోలీసు అతను అడగగా… కేసు పెట్టండి సార్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పెద్ద మనసు చేసుకుని ఈ సారికి రాజీ అవ్వరా అంటూ పోలీసులు కోరగా ఈ ఒక్కసారికి రాజీ అవుతానని చెప్పాడు. అంతేకాదు, ఆ ఇద్దరు చిన్నారుల మధ్య రాజీ కుదిర్చి, చేయి చేయి కలిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇది నూతన #రాయలసీమ !
పెన్సిల్ పోయిందని కర్నూలు జిల్లా పెద కడుబూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు !😂 pic.twitter.com/HjDi7BoDO6
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 25, 2021