వీడు ఆరడుగుల బుల్లెట్టు.. పవన్ కంటే అకీరాకే సెట్ అయ్యింది

pawan

ఫిల్మ్ డెస్క్- అకీరా నందన్.. ఈ పేరు సినీ ప్రేక్షకులందరికి తెలిసే ఉంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకైతే అకీరా పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ చాలా పెద్దవాడైపోయాడు. ఎంతలా అంటే పవన్ కంటే పొడవుగా కనిపిస్తున్నాడు అకీరా. అందుకే పవన్ సినిమాలోని వీడు ఆరడుగుల బుల్లెట్టు.. అన్న పాట పవన్ కంటే ఆయన కొడుకు అకీరా నందన్ కే సూట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌తో విడిపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా పిల్లలు అఖిరా, ఆద్య లను కలిసి టైం స్పెండ్ చేస్తుంటారు. ఇదిగో ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, తనయుడు అకిరా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకు దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

akira

జూనియర్ పవర్ స్టార్ మరీ ఇంత పొడుగ్గా ఉన్నాడేంటి అంటున్నారు ఈ ఫోటో చూసినవాళ్లంతా. పవన్ కళ్యాణ్ పక్కన నిజంగానే ఆరగుగుల బుల్లెట్ లా ఉన్నాడు అకిరా నందన్. తండ్రి పక్కన ఎంతో వినయంగా కనిపించి పవర్ స్టార్ అభిమానుల్ని ఫిదా చేశాడు అకిరా. అన్నట్లు పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరా నందన్‌తో కలిసి మ్యూజిక్ నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సంగీతం టీచర్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. ఈ నేపధ్యంలో మ్యూజిక్ టీచర్ ఆనందం పట్టలేక పవన్ కళ్యాణ్, అకీరాలతో కలిసి తీయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పవన్ కళ్యాణ్, అతని తనయుడు అకిరా నందన్ తన దగ్గర సంగీతం నేర్చుకుంటూ తనకి శిష్యులు కావడం చాలా ఆనందంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంట్లో మ్యూజిక్ క్లాస్ డెమో ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో కొంత సమయం మాట్లాడే అవకాశం లభించిందని తన సంతోషాన్ని వ్కక్తం చేసింది టీచర్. అంతే కాదు పవన్ కళ్యాణ్ వయొలిన్ బాగా వాయిస్తారని కూడా చెప్పింది. మొత్తానికి పవన్, అకీరాల ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.