అల్లు అర్జున్ చేసిన పనికి ఆమె రాత్రంతా నిద్రపోలేదట

Allu Arjun at Pushpaka Vimanam - Suman TV

ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా బన్నీ డ్యాన్స్ కు చాలా మంది ఫిదా అవుతారు. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు సైతం అల్లు అర్జున్ స్టెప్స్ కు ఫ్లాట్ అవుతుంటారు. ఇక ఈ ఐకాన్ స్టార్ కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

అదిగో అలాంటి క్రేజే ఓ హీరోయిన్‌ కి కూడా ఉందట. అనుకోకుండా క‌లిసిన‌ప్పుడు అల్లు అర్జున్ చేసిన ప‌నికి రాత్రంతా నిద్ర‌పోలేద‌ని చెబుతోంది ఆ హీరోయిన్. అయ్యో అవరా హీరోయిన్, ఇంతకీ అల్లు అర్జున్ ఏంచేశాడని అనుకుంటున్నారా.. ఆ హిరోయిన్ పేరు శాన్వి మేఘ‌న‌. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా, ఆయ‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం పుష్ప‌క విమానం. దామోద‌ర్ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌ గానే సినిమా విడుద‌లైంది.

Saanvi meghana 1

పుష్పక విమానం సినిమా ప్ర‌మోషన్స్‌ లో భాగంగా అల్లు అర్జున్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఈ సినిమాలో శాన్వీ మేఘన హీరోయిన్ గా నటించింది. ఈ సందర్బంగా శాన్వి మేఘ‌న‌ను క‌లిసిన బ‌న్నీ, అభిమానంతో ఆమెను హగ్ చేసుకున్నారు. ఇంకేముంది త‌న అభిమాన హీరో అలా చేసేస‌రికి శాన్వి మేఘ‌న ఆనందానికి అంతు లేకుండా పోయింది.

అలా తన అభిమాన హీరో అల్లు అర్జున్ తనను కౌగిలించుకోవడంతో, రాత్రంతా ఆమె నిద్ర పోలేద‌ని రీసెంట్‌ గా ఇంట‌ర్వ్యూలో చెప్పింది శాన్వీ మేఘన. త‌న త‌ల్లికి కూడా ఈ విషయాన్ని చెప్పానని చెప్పుకొచ్చింది శాన్వీ. అదన్న మాట సంగతి. అల్లు అర్జున్ హగ్, పుష్పక విమానం హీరోయిన్ కు నిద్ర లేకుండా చేసిందన్నమాట.