ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి.. సినిమాల్ల నటించడమే కాదు, టీవీ షోలు కూడా చేస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఆహా యాప్ కోసం మంచు లక్ష్మి ఆహా భోజనంబూ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి హోస్ట్ చేస్తోంది. సెలెబ్రిటీలతో రకరకాల వంటలు వండించేందుకు మంచు లక్ష్మీ ఆహా భోజనంబూ షోతో ముందుకు వచ్చారు. ఈ షోకు సంబందించి మొట్టమొదటి ఎపిసోడ్‌లో హీరో విశ్వక్ సేన్ సందడి చేశాడు. ఈ షోలో విశ్వక్ సేన్ తన ఇంట్లో వండే వంటలు, ఇంట్లో పద్దతులను వివరించాడు.
మంచు లక్ష్మీ సైతం తన ఆహారానికి సంబందించిన అభిరుచులను చెప్పారు. ఇక హీరో విశ్వక్ సేన్ ఇంట్లో వారంలో ఒక్క రోజు మాత్రమే వెజ్ వండుతారట. మిగతా ఆరు రోజులు చికెన్, మటన్, ఫిష్ లాంటి నాన్ వెజ్ వంటకాలే ఉంటాయట. అంతే కాదు ప్రతీ రోజూ ఇంట్లో పాయ ఉండాల్సిందేనని చెప్పారు విశ్వక్ సేన్. అందులోను మటన్ పాయ, చికెన్ పాయ వంటి వెరైటీలు చేస్చారని చెప్పుకొచ్చారు.
ప్రతి రోజు ఇంట్లో కనీసం 20మందికైనా అమ్మ వండిపెడుతుందని విశ్వక్ సేన్ చెప్పారు. వంటంలు వండటం, ఎదుటివారికి తినిపించడం వంటివి అమ్మ నుంచి నేర్చుకున్నానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనకు కూడా నాన్ వెజ్ వంటకాలంటే ఇష్టమని మంచు లక్ష్మీ చెప్పారు. ఇక వఆహా భోజనంబు షోలో వెజ్ వంటకాన్ని వండిన విశ్వక్, మంచు లక్ష్మీని తన ఇంటికి ఆహ్వానించారు.
లక్ష్మి వస్తే ఏడు, ఎనిమిది రకాల నాన్ వెజ్ వంటకాలను వండిపెడతానని చెప్పారు విశ్వక్ సేన్. అందుకు అంగీకరించిన మంచు లక్ష్మి, సైకిల్ మీద వస్తానని, వెళ్లేటప్పుడు కాస్త ఎక్సర్ సైజ్ చేసినట్టు కూడా అవుతుందని మంచు లక్ష్మీ అన్నారు. దీనికి స్పందించిన విశ్వక్ సేన్.. మా ఇంటికి వచ్చాక వెళ్లడం ఉండదు.. తినడంతో అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని కామెంట్ చేశారు.