ఆ రాయి 20 ఆఫ్రికా ఏనుగల బరువుతో సమానం.. కానీ ఒక్కళ్లే కదిలించొచ్చు!

A man lifting 132 kgs Stone

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింతలు- విశేషాలు ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఇంకా ప్రజలకు తెలియని ఎన్నో వింతలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ ఆర్టికల్‌ లో చెప్పేది ఆ కోవకు చెందిందే. దీనిని ప్రత్యక్షంగా చూడాలంటే ఫ్రాన్స్‌ వెళ్లాలి మరి. కానీ, అక్కడి దాకా వెళ్లే పని లేకుండా దానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ ఆర్టికల్‌ లో మీకోసం చెప్పేస్తున్నాం. ఇలాంటి వింత రాళ్లను మన దేశంలోనూ చాలా ఆలయాల వద్ద చూసే ఉంటారు. కానీ, ఇది అంత సామాన్యమైన రాయి కాదు. దీని బరువు 20 ఆఫ్రికా ఏగులతో సమానం. కానీ, కేవలం ఒక్క మనిషి ఏ విధంగా కదప గలుగుతున్నాడు అనేది ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్న.

ఈశాన్య ఫ్రాన్స్‌ లోని హ్యూగల్‌ అటవీ ప్రాంతంలో ఈ వింత రాయి ఉంది. దీని బరువు 132 టన్నుల బరువు ఉంటుంది. ఇది అంత ప్రమాదకరమైన అడవేం కాదు. అక్కడికి పర్యాటకులు ఈ రాయిని కదిపేందుకే ఎక్కువగా వస్తుంటారు. మాములుగా చీమలు తమ బరువుకున్నా అధిక రెట్ల వస్తువులను మోయగలదు. కానీ, మనిషి అలా చేయలేడు. మరి ఈ రాయి మనిషి కంటే వందలరెట్ల బరువుంటుంది. దానిని ఎలా కదపగలుగుతున్నారు అనేది అంతు చిక్కని ప్రశ్న.

అయితే ఈ రాయిని ఏ మూల నుంచైనా కదిపేస్తాం అంటే కుదరదు. కేవలం ఒక మూల నుంచి మాత్రమే దాన్ని కదిలించగలరు. అక్కడి నుంచి తప్ప మరేవైపు నుంచి ప్రయత్నించినా అది కదలదు. చాలా మంది పర్యాటకులు దానిని కదిపేందుకు ప్రయత్నించి విఫలమవుతుంటారు. కానీ, పర్టిక్యులర్‌ మూల నుంచి కదిపిన వారు మాత్రమే దానిని కదిలించ గలిగారు. మరి ఆ రాయిని ఎలా కదపగలిగారో మీరూ చూసేయండి. అందులో దాగున్న మర్మం ఏంటో కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.