ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించే మాట్లాడుతున్నాయి. వాటి వాడకం కూడా బాగా పెరిగిపోయింది. పర్వావరణానికే కాకుండా.. వినియోగదారులకు కూడా వాటి వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది. అయితే అక్కడ మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై బ్యాన్ విధించారు.
ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ వాహనాల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుంది. ఎందుకంటే పెట్రోల్ తో నడిచే వాహనాల కంటే విద్యుత్ వాహనాలకు మెయిన్టినెన్స్ తక్కువగా ఉంటుంది. పెట్రోల్ ఖర్చులు కూడా పెరుగుతుండటంతో ఇవే బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇలా అందరూ ఎలక్ట్రిక్ వైపు మళ్లుతుంటే ఒక దేశం మాత్రం ఆ వాహనాలపై బ్యాన్ విధిచింది. వారి వీధుల్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కనిపించకూడదు అంటూ నిషేదించింది. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి.
ఈ బ్యాన్ విధించింది ఇండియాలో కాదులెండి.. ఫ్రాన్స్. అవును ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ప్రభుత్వం రెంటెండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తిరగకుండా బ్యాన్ చేసింది. పారిస్ లో 2018లో తొలిసారి ఈ రెంటల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేశారు. వీటిని స్మార్ట్ ఫోన్లో యాప్ ద్వారా బుక్ చేసుకుని మీరు పారిస్ నగరంలో చక్కర్లు కొట్టచ్చు. ఇవి గరిష్టంగా 20 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే వీటితో వచ్చిన సమస్య ఏంటంటే.. ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ రెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కారణంగా పారిస్ లో ఒక్క 2021వ సంవత్సరంలో మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంక 2022లో ఈ స్కూటర్ల కారణంగా మొత్తం 456 ప్రమాదాలు సంభవించినట్లు ట్రాఫిక్ పోలీసులు నివేదించారు.
The mayor of Paris said on Monday that electric scooters would be banned beginning September 1 after the public voted to remove them from the streets.
Find out more at https://t.co/UyO0TuWQpb 🚀#engineering #interestingengineering pic.twitter.com/17rjkZaE69
— Interesting Engineering (@IntEngineering) April 3, 2023
అంతేకాకుండా వీటికి పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. సరైన సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది వాటిని రోడ్డు మీదే వదిలేసి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ అన్ని కారణాలను పరిగణలోకి తీసుకున రెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై పారిస్ మేయర్ మాట్లాడుతూ.. “పారిస్ ప్రజలు చాలా స్పష్టంగా వారి నిర్ణయాన్ని వెల్లడించారు. మేము వారి అభిమతానికి తగిన విధంగానే నిర్ణయం తీసుకున్నాం” అంటూ వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి ఈ బ్యాన్ అమలులోకి రానుంది. పారిస్ నగరంలో రెంటెండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
For-hire electric scooters are set to be banned from the streets of Paris, after nearly 90 percent of voters in the French capital voiced opposition in a recent referendum. https://t.co/jAgCrZkCd7 pic.twitter.com/DNwijHe6wM
— AFP News Agency (@AFP) April 3, 2023