లేడీ ఫ్యాన్‌ కంటతడి.. స్టార్‌ హీరో చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

Seeing the fan fainting, Tiger Shroff hugged him

Tiger Shroff: జాకీ శ్రాఫ్‌ తనయుడిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు టైగర్‌ శ్రాఫ్. మొదటి సినిమా‘‘హీరో పంటి’’నుంచి తనదైన యాక్షన్‌ ఫీట్లతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్‌ ‘‘వర్షం’’ సినిమా రీమేక్‌ ‘‘భాగీ’’తో తనకంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. హిట్లు, ప్లాపులతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన హీరో పంటి -2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో టైగర్‌ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్‌ సందర్భంగా టైగర్‌ శ్రాఫ్‌ ఓ లేడీ ఫ్యాన్‌ను హగ్‌ చేసుకున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు టైగర్‌ శ్రాఫ్‌ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. టైగర్‌ మనసు వెన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ సంగతేంటంటే.. కొద్దిరోజుల క్రితం టైగర్‌ శ్రాఫ్‌, తారా సుతారియాలు హీరో పంటి 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. టైగర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఈవెంట్‌కు వచ్చారు. వీరిలో లేడీ ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. తన అభిమాన నటుడ్ని చూడగానే ఓ లేడీ ఫ్యాన్‌ అతడి దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించింది. అయితే, అతడికి సెక్యూరిటీగా ఉన్న లేడీ బౌన్సర్లు ఆమెను అడ్డుకున్నారు. అతడి దగ్గరకు వెళ్లనివ్వలేదు. దీంతో టైగర్‌ను చూస్తూ సదరు ఫ్యాన్‌ ఏడవటం మొదలుపెట్టింది. ఒక్కసారి దగ్గరకు రానివ్వాలని ప్రాథేయపడింది. బౌన్సర్లు నీళ్లు తాగించటానికి ప్రయత్నించినా వద్దని అంది.

 Seeing the fan fainting, Tiger Shroff hugged him

ఆమె కంటతడి పెట్టటం చూసిన టైగర్‌ చలించిపోయాడు. ఆమెను స్టేజిమీదకు తీసుకురమ్మని బౌన్సర్లకు చెప్పాడు. వారు లేడీ ఫ్యాన్‌ను టైగర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడిన అతడు గుండెలకు హత్తుకుని ఓదార్చాడు. ఏడవకూడదని ధైర్యం చెప్పాడు. ఆ లేడీ ఫ్యాన్‌ టైగర్‌ పక్కనే ఉన్న హీరోయిన్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, కిందకు దిగి వెళ్లిపోయింది.  మరి, లేడీ ఫ్యాన్‌కు టైగర్‌ హగ్‌ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : సన్నాఫ్‌ ఇండియా మీద సెటైర్లు.. నాగబాబు ఊరుకోడుగా!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.