మహలక్ష్మి గెటప్‌లో మిల్కీబ్యూటీ తమన్నా! ఫోటో వైరల్!

ఇండస్ట్రీలో ఏ నటులైనా ప్రయోగాత్మక పాత్రలపై ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అలాంటి పాత్రల్లో వారికి మంచి గుర్తింపు వస్తుందన్న విషయం తెలిసిందే. అలా చేసిన పాత్రలు సినీ చరిత్రలో గుర్తుండిపోతాయి.  రమ్యకృష్ణ,అనుష్క, నయనతార మొదలైన వారు ప్రయోగాలకు ముందుంటారు. వారి సరసన చేరే ప్రయత్నంలో ఉన్నారు మన మిల్క్ బ్యూటీ తమన్నా. ఇటీవల ఓ మూవీ కోసం ఆమె వేసిన డిఫ‌రెంట్ గెట‌ప్ అభిమానులను ఆకట్టుకుంది. ఇంత‌కీ అంత‌లా త‌మ‌న్నా ఏ గెట‌ప్ వేసింద‌బ్బా అనే సందేహం రాక మాన‌దు. తమన్నా మహలక్ష్మి గెటప్ వేసి దటీజ్ మహలక్ష్మి అనే కనిపించింది.

image 2 compressed 32006లో ‘శ్రీ’ సినిమాతో తమన్నా భాటియా తెలుగు చలనచిత్ర పరిశ్రలోకి అడుగుపెట్టారు. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించింది. సైరా నరసింహారెడ్డిలో చేసిన పాత్ర చిన్నదే అయిన గుర్తింపు తెచ్చింది. బాహూబలి సినిమాతో తనలో ఓ యుద్ధ యోధురాలిని చూపించింది. ఇలా ఎన్నో చిత్రాలో హిరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమన్నా హీరోయిన్‌గానే చేయాల‌ని నిబంధ‌న పెట్టుకోకుండా నెగేటివ్ ఉన్న పాత్ర ను కూడా మాస్ట్రోలో చేసి ప్రేక్షకుల‌ను మెప్పించింది. త‌మ‌న్నా ట్రెండ్‌కు త‌గిన‌ట్లు సినిమాలు చేయ‌డానికి సిద్ధమ‌వుతోంది. అలాగే సిల్వర్ స్క్రీన్‌కే ప‌రిమిత‌మ‌వకుండా ఓటీటీల్లో అడుగు పెట్టి ఆక‌ట్టుకుంది. ఆహాలో ‘లెవన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్‌లో త‌మ‌న్నా మెయిన్ రోల్ పోషించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ‘మాస్టర్ చెఫ్’ అనే వంట‌ల ప్రోగ్రామ్‌కి కూడా త‌మ‌న్నా హోస్ట్‌గా వ్యవ‌హ‌రించింది.

image 0 compressed 3
ఇప్పుడు అసలు మహలక్ష్మి గెటప్ విషయానికి వస్తే… అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నా F3 సినిమా కోసం మహలక్ష్మిలాగా కనిపించారు. అనిల్ రావిపూడి తీసిన F2 చిత్రం ఎంత సక్సెస్ అయిందో మనందరికి తెలిసిందే. దానికి స్వీక్వెల్ గా దిల్ రాజు నిర్మాతగా F3 చిత్రాన్ని తీస్తున్నారు. డ‌బ్బు వ‌ల్ల మ‌నుషులు ఎలాంటి ఫ్రస్టేష‌న్‌కు గుర‌వుతున్నార‌నే క‌థాంశంతో F3 మూవీ రూపొందిస్తున్నారు. డ‌బ్బుకి అధినేత ఎవ‌రు మ‌హ‌ల‌క్ష్మి. ఈ సినిమా స‌న్నివేశ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా త‌మ‌న్నా మ‌హ‌ల‌క్ష్మి వేషాన్ని వేసి టిఫ‌న్ చేసింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, వరణ్ తేజ్, మెహ్రీన్ నటిస్తున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. F3 తో పాటు ఇప్పుడు త‌మ‌న్నా తెలుగులో చేస్తున్న మ‌రో సినిమా భోళా శంక‌ర్‌. ద‌ర్శకుడు మెహ‌ర్ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జ‌త‌గా త‌మ‌న్నా నటించనున్నారు.