తమన్నా.. ఈ మధ్య ఎక్కడ విన్నా, మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ పేరు డీటీఎస్ని మించిన సౌండ్‌తో వినిపిస్తుంది. ప్రస్తుతం రజినీ కాంత్ పక్కన చేస్తున్న ‘జైలర్’ మూవీ నుండి రిలీజ్ అయిన ‘కావాలయ్యా’ సాంగ్ ఓ ఊపు ఊపుతుంది.
తమన్నా.. ఈ మధ్య ఎక్కడ విన్నా, మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ పేరు డీటీఎస్ని మించిన సౌండ్‌తో వినిపిస్తుంది. ప్రస్తుతం రజినీ కాంత్ పక్కన చేస్తున్న ‘జైలర్’ మూవీ నుండి రిలీజ్ అయిన ‘కావాలయ్యా’ సాంగ్ ఓ ఊపు ఊపుతుంది. సెలబ్రిటీలంతా తెగ రీల్స్ చేస్తున్నారీ పాటకి. ఇక ఇన్నాళ్లూ ఆన్ స్క్రీన్ హీరోలకి లిప్‌లాక్ అంటే నో చెప్పి, ‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయి రచ్చ చేసింది. మిల్కీబ్యూటీ బోల్డ్ క్యారెక్టర్ చూసి ఆడియన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు షాక్ అయ్యారు. తర్వాత ‘లస్ట్ స్టోరీస్ 2’ తో మరో సాలిడ్ షాక్ ఇచ్చింది. ఈ సిరీస్ తమన్నాకి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ షూటింగ్ అప్పుడే సహ నటుడు విజయ్ వర్మతో పరిచయం, ప్రేమ, రిలేషన్ స్టార్ట్ అయ్యాయి.
రియల్ లైఫ్ బాయ్‌ఫ్రెండ్‌తో రీల్లో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. కొంతకాలం సడెన్‌గా కెమెరాల కంట పడిందీ జంట. ఎట్టకేలకు తమ రిలేషన్ గురించి ఓపెన్ అయింది తమ్మూ. ‘‘విజయ్ వర్మతో అంత క్లోజ్‌గా ఉంటున్నానంటే అతను నా కో యాక్టర్ అనే కాదు. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. ఎవరినైనా లవ్ చేయాలంటే వారితో ఉంటే మనం హ్యాపీగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో ఉంటే నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇప్పటిదాకా నేను ఎంతోమంది హీరోలతో కలసి యాక్ట్ చేశా. వాళ్లందరి కంటే విజయ్ స్పెషల్.
అతడు నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. కష్టం వస్తే నాకు తోడుగా ఉంటాడనే విశ్వాసం ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో మనం ఎదుగుతున్నామంటే కిందకు లాగేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ విజయ్ అలాంటి వారి నుంచి నన్ను రక్షిస్తాడు. నా విషయంలో అతడు ఎంతో కేర్ తీసుకుంటాడు. విజయ్ వర్మ ఎక్కడ ఉంటే అక్కడే నా సంతోషం. ‘లస్ట్ స్టోరీస్ 2’ సెట్స్‌లోనే తమ ఇద్దరి మధ్య బంధం మొదలైంది’’ అని చెప్పుకొచ్చింది.
అయితే వీరిద్దరూ నిజంగా రిలేషన్లో లేరని, ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రమోషన్స్ కోసమే అలా చెప్పారంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా తమన్నా ప్రియుడి ఆ పుకార్లకు చెక్ పెడుతూ, తమ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు. మిల్కీబ్యూటీతో డీప్ లవ్‌లో ఉన్నానని కన్ఫమ్ చేసేశాడు. ‘‘మేమిద్దరం డేటింగ్లో ఉన్నామని ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఆమెతో ఎంతో హ్యాపీగా ఉన్నా. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నా. తన రాకతో నా లైఫ్‌లో విలన్ దశ ముగిసిపోయి.. రొమాంటిక్ దశ మొదలైంది’’ అంటూ తమ మధ్య ఎంతటి స్ట్రాంగ్ బాండింగ్ ఉందనేది క్లారిటీ ఇచ్చేశాడు.