అందరికీ తెలిసిన, పైకి చెప్పలేని కొన్ని విషయాల గురించి సెలబ్రిటీలు ఏ చిన్న మాట మాట్లాడినా కానీ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. కొన్ని కొన్ని సార్లు వాళ్లు మాట్లాడింది పెద్ద విషయం కాకపోయినా.. చెప్పిన విధానాన్ని బట్టి ట్రోల్‌కి గురవుతుంటారు నటీనటులు.
అందరికీ తెలిసిన, పైకి చెప్పలేని కొన్ని విషయాల గురించి సెలబ్రిటీలు ఏ చిన్న మాట మాట్లాడినా కానీ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. కొన్ని కొన్ని సార్లు వాళ్లు మాట్లాడింది పెద్ద విషయం కాకపోయినా.. చెప్పిన విధానాన్ని బట్టి ట్రోల్‌కి గురవుతుంటారు నటీనటులు. పోనీ జనాలకి తెలిసిన సంగతులు లేదా గతంలో వాళ్లకెదురైన అనుభవాల గురించి చెప్తే మాత్రం వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్‌గా బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా చేసిన ఆసక్తికరమైన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. సెన్సేషనల్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ గురించి తెలియని వారుండరు. ఫస్ట్ సీజన్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సెకండ్ సీజన్ కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. అడల్ట్ కంటెంట్, బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే వేరే లెవల్లో ఉన్నాయి. ఈ క్రేజీ సిరీస్‌లో మిల్కీబ్యూటీ తమన్నా, కాజోల్, విజయ్ వర్మ, అమృత సుభాష్, అంగద్ బేడీ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
‘లస్ట్ స్టోరీస్’ సిరీస్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సెకండ్ సీజన్ జూన్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అమిత్ శర్మ, కొంకొణాసేన్ శర్మ, ఆర్.బాల్కి, సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో నీనా గుప్తా కూడా నటించారు. సినిమాల్లో తన వయసుకి తగ్గ పాత్రలు రావడం లేదని గతకొద్ది కాలంగా దూరంగా ఉంటున్న ఆమె ‘లస్ట్ స్టోరీస్ 2’ లో ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ ట్రైలర్, అందులో చూపించిన సన్నివేశాల గురించి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తూ.. శృంగారం గురించి యువత తెలుసుకోవడం ఎంతో అవసరమని, కాలేజీకి వెళ్లే రోజుల్లో ముద్దు పెట్టుకోవడం ద్వారా అమ్మాయిలు గర్భం దాల్చుతారనుకునేదాన్నని, తన తల్లి చాలా స్ట్రిక్ట్ అంటూ గతంలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు నీనా.
‘నాకు 12, 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మా తల్లిదండ్రులు సపరేట్ గదిలో పడుకోలేదు. మేమందరం ఒకటే బెడ్‌రూంలో నిద్రపోయేవాళ్లం. నేను, నా సోదరుడు మంచం పక్కన కింద పడుకునేవాళ్లం. కొన్నిసార్లు నేను అమ్మా, నాన్నల మధ్యలో పడుకునేదాన్ని. అప్పటికి మాకు శృంగారం గురించి ఏమీ తెలియదు. మా అమ్మ దాని గురించి కానీ పీరియడ్స్ గురించి కానీ చెప్పలేదు. తను ఎంత కఠినంగా ఉండేదంటే, కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి సినిమా చూడ్డానికి కూడా వెళ్లనిచ్చేది కాదు. కాలేజీలో చదువుకునేటప్పుడు ముద్దు పెట్టుకోవడం ద్వారా గర్భవతి అవుతారని నమ్మేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాల గురించి తమ కూతుళ్లతో చెప్పడానికి తల్లులు భయపడేవారు. ఆ కాలంలో పెళ్లికి ముందు శృంగారం గురించి అమ్మాయిలకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఫస్ట్ నైట్ నాడు ఏం జరుగుతుందో, ఆ టైంలో అబ్బాయితో ఎలా ఉండాలో చెప్పేవారు. ఆ విషయంలో కొత్త దంపతుల మధ్య గొడవలు రాకూడదని అలా చెప్పేవారు. భర్త అడిగితే ఆ కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలో ఆడపిల్లలకు తల్లులు చెప్పేవారు. ఈరోజుల్లో కూడా ఇలా జరుగుతుంటుంది. అందుకే ఇలాంటి విషయాలకు ‘లస్ట్ స్టోరీస్ 2’ ఎంతో ముఖ్యమైనది. దీనిలో శృంగార సన్నివేశాలుంటాయి. అయితే తప్పేంటి? మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవలసిన విషయాన్నే ఒక సినిమా ద్వారా చెప్తున్నాం. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా.