నాగ చైతన్య-సమంత విడాకులపై ఎమోషనల్ అయిన సురేఖా వాణి

surekha vani

గత కొంత కాలం నుంచి సామ్-చైతు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు మీడియాలో కోడై కూశాయి. దీంతో అప్పటి అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఏనాడు కూడా వివరణ ఇచ్చింది లేదు. దీంతో వారు విడాకుల అంశంపై స్పందించకపోవటంతో వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అయితే శనివారం నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నామంటూ ఇద్దరూ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా తెలిపారు. అవును మేము విడిపోతున్నామని, అభిమానులు అర్థం చేసుకోవాలని తెలిపారు. వివాహ బంధంతో విడిపోతున్నా భవిష్యత్ లో స్నేహితులతో కలిసే ఉంటామంటూ తెలిపారు.

అయితే దీనిపై నాగార్జున కూడా భావోద్వేగంతో స్పందిస్తూ ఇలా జరగటం చాలా బాధాకరం అంటూ తెలిపారు. దీంతో సినీ నటులు ఒక్కొక్కరుగా వీరి విడాకులపై స్పందిస్తూ ఉన్నారు. అయితే తాజాగా స్పందించారు సీనియర్ నటి సురేఖా వాణి. శనివారం నాగార్జున పోస్ట్ చేసిన అదే పోస్ట్ ను తన ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేస్తూ బరువైన గుండెతో ఆమె ఎమోషనల్ అయ్యారు. నాగచైతన్య, సమంత విడిపోతున్నారనే వార్త తెలిసి గుండె పగిలిందంటూ తెలిపింది. ఇలా జరగకుండా ఉండాల్సింది.. చాలా బాధగా ఉంది అంటూ సురేఖా పోస్ట్ చేశారు.