సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..!

Sarkaaruvaaripaata

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌ అన్నీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మహేశ్‌ లుక్స్‌, స్లాంగ్‌ అన్నీ ఫ్యాన్స్‌ పిచ్చిపిచ్చిగా నచ్చేశాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీ ఎత్తునే జరిగింది. ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే 121 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇంతటి భారీ అంచనాలు నెలకొన్న సర్కారు వారి పాట చిత్రం ఫస్ట్‌ రివ్యూ రానే వచ్చింది. మూవీ సెన్సార్‌ బోర్డు మెంబర్‌ అయిన ఉమైర్‌ సంధు ‘సర్కారు వారి పాట’ చిత్రం చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు.

ఇదీ చదవండి: ‘ద పీకాక్‌’ క‌వ‌ర్‌పేజీపై స్టైలిష్ లుక్ తో మ‌హేశ్ బాబు..!

ఈ మూవీని ఉమైర్ సంధు ఎంతగానో ఎంజాయ్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు. యాక్షన్‌, ఎమోషన్‌, డ్రామా, కామెడీల కలపోత సర్కారు వారి పాట సినిమా అంటూ ఉమైర్ సంధు తెలిపాడు. ఈ సినిమాలో మొత్తం ఫుల్‌ మార్క్స్‌ మహేశ్‌ బాబుకి పడతాయంటూ తెలియజేశాడు. 2022లో తన ఫేవరెట్‌ మూవీగా సర్కారు వారి పాట ఉండిపోతుందంటూ కామెంట్‌ చేశాడు. అంతే కాకుండా రేటింగ్‌ 5కి ఏకంగా 4.5 స్టార్స్‌ ఇచ్చేశాడు. మహేశ్‌ లుక్స్‌, డైలాగ్‌ స్లాంగ్‌, కాస్టూమ్స్‌ చూసిన తర్వాత ఉమైర్‌ సంధు ఆ మాత్రం రేటింగ్‌ ఇవ్వడం తప్పు లేదంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.