హాట్ టాపిక్ గా సమంత పెళ్లి చీర.. ఇప్పుడు ఆ శారీ ఏం చేయబోతున్నారంటే?

‘ఏమాయ చేసావె’సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్లింది. ఇరు కుటుంబాలను ఒప్పించి మరి 2017, అక్టోబర్‌6న హిందూ, మరుసటి రోజు క్రిస్టియన్‌ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారే విడిపోవడంతో ఇప్పడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు తాము ఇక కలిసి ఉండలేమని ప్రకటించి అభిమానులకు నిరాశలో ముంచేశారు. ఇక ఎవరి జీవితంలో అయినా పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టం. అందుకే దాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలని భావిస్తారు. చైసామ్‌ల పెళ్లి ఫోటోలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి.

sagge minఎందుకంటే వివాహ సమయంలో అందరి చూపు సమంత కట్టుకున్న చీరపై ఉండటం. ఎందుకంటే ఆ చీరకు ఎంతో ప్రత్యేతక ఉందని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఆ చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. చాలాకాలం కిందటి చీర కావడంతో దానిని రీ మోడలింగ్‌ చేయడానికి రూ. 40 లక్షలు ఖర్చు అయ్యాయన్న వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. పెళ్లి నాటికి సమంత స్టార్‌ హీరోయిన్‌ అయ్యిండి కూడా అటు సాంప్రదాయం, ఇటు పెద్దల్ని గౌరవించడం విశేషంగా నిలిచింది.

సినీ సెలబ్రిటీలు వారి పెళ్లి గురించి ఎన్ని కలలు కంటుంటారు.. ఏ హీరో లేదా హీరోయిన్ వారి పెళ్లిని ప్రేక్షకులంతా కొన్నాళ్ల వరకు మాట్లాడుకునేంత ఆర్భాటంగా చేసుకుంటారు. అయితే సమంత కూడా అలాంటి కలలు కన్న ఆడపిల్లే. మరి అక్కినేని.. దగ్గుబాటి వంశానికి చెందిన ఆ సాంప్రదాయ చీర తన పెళ్లినాటి జ్ఞాపకంగా తన వద్దనే ఉంచుకుంటుందా.. లేదా చైతూకి తిరిగి ఇచ్చేస్తుందా అనే దానిపై టాలీవుడ్ లో తెగ చర్చ నడుస్తుంది.