ఇప్పుడు ఆమె అక్కినేని సమంత కాదు! అంతకు మించి! వాట్ ఏ యాక్షన్ లేడీ టైగర్!

తెలుగు సినిమా హీరోయిన్ అంటే అందరికీ ఓ చిన్న చూపు ఉంటుంది. 5 పాటలు, 4 ప్రేమ సన్నివేశాలు, 3 హగ్ లు, 2 లిప్ లాక్ లు.., క్లైమ్యాక్స్ లో హీరో గారితో పెళ్లి. ఇవి తప్ప ఇన్నేళ్ళలో మన తెలుగు సినిమా హీరోయిన్స్ సాధించిన ఘన చరిత్ర ఏమి లేదు. వారికి అంతటి స్పేస్ కూడా దొరకలేదు. ఎక్కడో ఓ సావిత్రి, ఓ షావుకారు జానకి, ఓ శ్రీదేవి, ఓ విజయశాంతి, ఓ సౌందర్య, ఓ రమ్యకృష్ణ లాంటి వారు మాత్రమే హీరో ఇమేజ్ అనే ప్రతి బంధకాన్ని దాటుకుని నటులుగా తమని తాము నిరూపించుకోగలిగారు. మిగిలిన వారికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇక కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో హీరోయిన్స్ కి స్క్రీన్ స్పేస్ దొరకడమే కష్టమైపోయింది. ఇలాంటి సమయంలోను తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటుంది అక్కినేని సమంత. నిజానికి చైతుతో పెళ్లి అయ్యే సమయానికి సామ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్. కానీ.., పెళ్లి తరువాత ఈమె కమర్షియల్ మూవీస్ దూరం అయిపోయింది. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. దీంతో.., సహజంగానే కుందనపు బొమ్మకి కాస్త గ్యాప్ వచ్చింది. సరిగ్గా.., ఇలాంటి సమయంలో ది ఫ్యామిలీ మేన్ సెకండ్ సీజన్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

sam 2మొదటి సీజన్ సూపర్ హిట్. దీంతో.., సెకండ్ సీజన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. సెకండ్ సీజన్ లో మొదటి మూడు ఎపిసోడ్స్ చాలా సో..సోగా సాగిపోయాయి. ఆ తరువాత సమంత పాత్ర ఎంటర్ అవుతుంది. మహిళా టైగర్ పాత్రలో సామ్ తన నట విశ్వరూపాన్ని చూపించింది. దివి నుండి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, రంగమ్మ మంగమ్మ లాంటి పాటల్లో స్టెప్పులు వేసిన సమంత కాదు. ఈమె ఓ కొత్త సమంత. సూసైడ్ బ్యాచ్. ఏకంగా దేశ ప్రధానిని చంపాలని చూస్తుంది. మొత్తం స్క్రీన్ అంతా ఆక్రమించేసింది. మనోజ్ వాజపేయి లాంటి నటుడు ఒకవైపు చెలరేగిపోతున్నా.., మనకి సమంత మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ లేడీ టైగర్ పాత్ర కోసం సామ్ పడ్డ కష్టం అర్ధం అవుతుంటుంది. ఎంత కమర్షియల్ చిత్రాలు చేసినా.., సమంతలో ఓ గొప్ప నటి ఉందని సౌత్ ప్రేక్షకులకి బాగా తెలుసు. కానీ.., ఆ టాలెంట్ ని బయట పెట్టుకునే అవకాశాలు ఆమెకి అంతగా రాలేదు. కానీ.., ఇప్పుడు బాలీవుడ్ పీపుల్ కి సమంత చాలా కొత్తగా పరిచయం అయ్యింది. ఇప్పుడు సామ్ పాన్ ఇండియా హీరోయిన్. ఒకవైపు అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు కూడా ఒక్క సాలిడ్ సక్సెస్ కోసం నానా కష్టాలు పడుతుంటే.., సమంత మాత్రం ఇండియన్ సినిమాని దున్నేస్తోంది. సో.., ఇందుకే ఇకపై ఈమె అక్కినేని సమంత కాదు, అంతకు మించిన సమంత. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.