హోరాహోరీగా ‘మా’ ఎన్నికలు.. చివరికి అంతా ఒకే కుటుంబం అంటున్న సాయికుమార్‌

Maa Elections Saikumar

‘మా’ ఎన్నికలు జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌కు చెందిన సభ్యులు అందరూ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారి వారి శిబిరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకునే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎందరో వారివారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్‌ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మా ఎన్నికల్లో విలక్షణ నటుడు సాయికుమార్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తన కుమారుడు ఆదితో కలిసి వచ్చి తన ఓటు వేశాడు సాయికుమార్‌. ‘ఎక్కడ చూసినా ఇప్పుడు అందరూ మా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. నేను బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు ఫ్లైట్‌ కూడా అందరూ రేపు ఏం జరగబోతోంది? ఎవరు గెలుస్తారు అనే అడుగుతున్నారు’ అంటూ సాయికుమార్‌ చెప్పుకొచ్చారు. పలు విమర్శలు చేసుకుంటున్నారు కదా మీరేమంటారు అని అడగగా.. ‘ఎన్నికలు అన్నాక అలాంటి విమర్శలు సహజం. అలా మాట్లాడుకుంటారు. సాయంత్రానికి అందరూ ఒక్కటే ఇవన్నీ టీ కప్పులో తుఫాను లాంటివి’ అని సాయికుమార్‌ వ్యాఖ్యానించాడు. ఆది మాట్లాడుతూ ‘నేను రెండోసారి ఓటు వేస్తున్నాను. ఎవరు గెలిచినా ఆర్టిస్టుల కోసం మంచి పనులు చేయాలి. అంతా ఒక కుటుంబం వాళ్లమే’ అంటూ ఆది వ్యాఖ్యానించాడు.